Chess | ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ సాధించి.. గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌కు చేరువలో తెలంగాణ బిడ్డ
చెస్‌లో అందరూ కలలు కనే గ్రాండ్ మాస్టర్ టైటిల్‌కు చేరువలో ఉన్నాడు మన తెలంగాణ బిడ్డ ప్రణీత్ ఉప్పల. 11 ఏళ్ల వయసులో తొలిసారి ఇంటర్నేషనల్ మాస్టర్ నార్మ్ అందుకున్న అతను.. 2022 జనవరిలో జరిగిన వెర్గానీ కప్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో మరో ఐఎం (ఇంటర్నేషనల్ మాస్టర్)-నార్మ్ అందుకున్నాడు.
ఈ క్రమంలోనే మార్చి 15న ఇంటర్నేషనల్ మాస్టర్ రత్నవేల్తో జరిగిన మ్యాచ్‌ను డ్రా చేసుకోవడంతో తొలి ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. దీంతోపాటు తొలి గ్రాండ్‌మాస్టర్ (జీఎం)-నార్మ్ కూడా అందుకున్నాడు. ఈ సందర్భంగా అతనికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
2021 సెప్టెంబరులో 2253 రేటింగ్త ఉన్న అతను ఐదు నెలల్లోనే 179 పాయింట్లు సాధించాడు. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ టైటిల్‌కు కావలసిన అర్హతలన్నీ పూర్తిచేశాడు. ప్రస్తుతం 67.9 ఎలో పాయింట్లతో ఉన్న ప్రణీత్.. గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించడానికి రెండంటే రెండు నార్మ్ (ఉత్తమ ప్రదర్శన)ల దూరంలో నిలిచాడు. త్వరలోనే ఇవి కూడా సాధించి భారత దేశపు తర్వాతి గ్రాండ్‌మాస్టర్‌గా ప్రణీత్ అవతరించాలని కోరుకుందాం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

