Chennai footballer | వైద్యుల నిర్లక్ష్యంతో చెన్నై ఫుట్‌బాల్ యువ క్రీడాకారిణి మృతి
కంప్రెసర్ బ్యాండేజీ కారణంగా రక్త ప్రసరణ ఆగిపోయి ప్రాణాలు విడిచిన ప్రియ
చైన్నైకి చెందిన 17 ఏళ్ల ఫుట్‌బాల్ క్రీడాకారిణి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా చనిపోయింది. ప్రియ అనే యువ ఫుట్‌బాలర్ కుడికాలి లిగమెంట్ చీలిక రావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. అయితే, వైద్యుల నిర్లక్ష్యం వల్ల సర్జరీ వికటించడంతో ఆమె కుడి కాలు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ప్రియ నవంబర్ 8వ తేదీ నుంచి రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో ఉంది. ప్రియ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి మా సుబ్రమణియన్ అంగీకరించారు.
మంత్రి మట్లాడుతూ… ‘క్రీడాకారిణి మరణించడం బాధాకరం. డాక్టర్లు సర్జరీ బాగానే చేశారు. కానీ, కంప్రెషన్ బ్యాండేజీ గట్టిగా వేయడంతో రక్తప్రసరణ ఆగిపోయింది. దాంతో, క్రీడాకారిణి చనిపోయింది. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరు డాక్టర్లను సస్పెండ్ చేశాం. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది’ అని చెప్పారు.
ప్రియ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్స్ చదువుతోంది. భారత ఫుట్‌బాల్ జట్టులో ఆడాలని కలలు కన్నదని ఆమె కోచ్ జోయెల్ చెప్పారు. ఆమె చనిపోవడానికి ముందు రోజు మంత్రి సుబ్రమణ్యం ఆమె కుటుంబాన్ని పరామర్మించారు. ఆధునిక కృత్రిమ కాలు ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. కానీ ఇంతలోనే ప్రియ చనిపోవడంతో కుటుంబసభ్యులు, తోటి క్రీడాకారులు ఆందోళన చేపట్టారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

