CSK vs PBKS : పంతొమ్మిదో సీజన్‌ను ఓటమితో ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్(CSK) ధోనీ లేకుండానే రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. తమ సొంత మైదానమైన చెపాక్‌లో పంజాబ్ కింగ్స్(Punjab Kings)ను సీఎస్కే ఢీ కొడుతోంది. స్పిన్‌కు అనుకూలించే పిచ్ మీద పంజాబ్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాలని రుతురాజ్ గైక్వాడ్ సేన భావిస్తోంది. టాస్ గెలిచిన పంజాబ్ సారథి శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ తీసుకున్నాడు.
తొలి పోరులో అదిరే విజయంతో జోరు మీదున్న పంజాబ్ చెపాక్‌లోనూ చెలరేగాలని అనుకుంటోంది. కుర్రాళ్లతో అద్భుతం చేయాలని భంగపడిన చెన్నై సొంత గడ్డపై పంజ విసరాలనే కసితో ఉంది. మొత్తంగా.. రికార్డులు చూస్తే రెండు జట్లు టోర్నీలో సమాన (16-16) విజయాలు సాధించాయి.
🚨 TOSS 🚨@PunjabKingsIPL won the toss against @ChennaiIPL and will field first
Updates ▶️ https://t.co/riWrE2EZiF#TATAIPL | #KhelBindaas | #CSKvPBKS pic.twitter.com/QcgJtAviOp
— IndianPremierLeague (@IPL) April 3, 2026
కానీ, కొన్ని సీజన్లుగా సీఎస్కేపై పంజాబ్ 6-1తో ఆధిపత్యం చెలాయించింది. పంజాబ్ ఏ మార్పులు ఏకుండా ఆడుతుండగా.. మ్యాట్ షార్ట్ స్థానంలో చెన్నై జట్టులోకి ప్రశాంత్ వీర్ వచ్చాడు. రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ యువ ఆల్‌రౌండర్‌ను చెన్నై రూ.14.20 కోట్లకు కొన్నది.
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు : సంజూ శాంసన్(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివం దూబే, కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, మ్యాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్.
పంజాబ్ కింగ్స్ తుది జట్టు : ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), కూపర్ కొన్నొల్లి, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), శశాంక్ సింగ్, నేహల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సెన్, గ్జావియర్ బార్ట్లెట్, విజయ్‌కుమార్, అర్ష్‌దీప్ సింగ్, చాహల్.
ఇంప్యాక్ట్ సబ్స్ – చెన్నై : జేమీ ఓవర్టన్, రాహుల్ చాహర్, మాథ్యూ షార్ట్, రామక్రిష్ణ ఘోష్, గుర్జన్‌ప్రీత్ సింగ్.
పంజాబ్ : సూర్యాన్ష్ షెడ్గే, ప్రియాన్ష్ ఆర్య, విష్ణు వినోద్, ప్రవీణ్ దూబే, హేమంత్ బార్.