IPL 2023 : చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అదరగొట్టింది. ఆల్‌రౌండ్ షోతో పటిష్టమైన ముంబై ఇండియన్స్‌పై అద్భుత విజయం సాధించింది. 12 ఏళ్ల తర్వాత ముంబైని చెపాక్‌లో ఓడించింది. ఓపెనర్ డెవాన్ కాన్వే(44), రుతురాజ్ గైక్వాడ్(30), శివం దూబే(26) దంచికొట్టారు. అర్షద్ ఖాన్ ఓవర్లో ఎంఎస్ ధోనీ(2) సింగిల్ తీయడంతో చెన్నై 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఆరో విజయంతో ప్లే ఆఫ్ అవకాశాలను పదిలం చేసుకుంది.
సొంత అభిమానుల మధ్య చెన్నై జట్టు అన్ని విభాగాల్లో సత్తా చాట్టింది. స్వల్ప లక్ష్య ఛేదనలో చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(30), ధాటిగా ఆడారు. తొలి వికెట్‌కు 46 పరుగులు చేశారు. పీయూష్ చావ్లా ఈ జోడీని విడదీశాడు. గైక్వాడ్‌ను ఔట్ చేసి ముంబైకి బ్రేక్ ఇచ్చాడు. దాంతో, తొలి వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. డెవాన్ కాన్వే(18), అజింక్యా రహానే(21)ను ఎల్బీగా వెనక్కి పంపాడు. ఇంపాక్ట్ ప్లేయర్ అంబటి రాయుడు(12), కాన్వే చెన్నై స్కోర్ వంద దాటించారు. శివం దూబే() మరోసారి సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. చెన్నై 6 వికట్ల తేడాతో గెలుపొందింది. ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా రెండు, స్టబ్స్, ఆకాశ్ మద్వాల్ ఒక్కో వికెట్ తీశారు.
సొంత గ్రౌండ్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు హడలెత్తించారు. దాంతో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. చెన్నై బౌలర్ల ధాటికి ముంబై టాపార్డర్ విఫలమైంది. స్టార్ ప్లేయర్స్ విఫలం అయిన చోట నేహల్ వధేరా(64) సాధికార ఇన్నింగ్స్ ఆడాడు. అర్ధ శతకంతో రాణించాడు. ట్సిస్టన్ స్టబ్స్(20)తో కలిసి ధాటిగా ఆడి ముంబై స్కోర్ వంద దాటించాడు. వీళ్లు ఐదో వికెట్‌కు 54 పరుగులు జోడించారు. సూర్యకుమార్ యాదవ్(26), ఇషాన్ కిషన్(7), రోహిత్ శర్మ(0), విధ్వంసక ఆటగాడు టిమ్ డేవిడ్(2) తక్కువకే ఔట్ కావడంతో ముంబై భారీ స్కోర్ చేయలేకపోయింది. చెన్నై బౌలర్లలో మథీశ పథిరన మూడు, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే రెండేసి వికెట్లు తీశారు. జడేజాకు ఒక వికెట్ దక్కింది.20 ఏళ్ల పథిరన 15 పరుగలిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో వ్యక్తిగతంగా ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు.