Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్‌కు రూ.19.5కోట్ల ప్రైజ్‌మనీ.. మిగతా జట్లకు దక్కింది ఎంత అంటే..?
Champions Trophy | టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్, స్పిన్నర్ల అద్భుత ప్రదర్శనతో భారత జట్టు న్యూజిలాండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి రికార్డుస్థాయిలో మూడోసారి చాంపియన్స్ ట్రోఫీని నెగ్గింది. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ రిటైర్మెంట్పై తెగ ప్రచారం జరిగింది.
Champions Trophy | టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్, స్పిన్నర్ల అద్భుత ప్రదర్శనతో భారత జట్టు న్యూజిలాండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి రికార్డుస్థాయిలో మూడోసారి చాంపియన్స్ ట్రోఫీని నెగ్గింది. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ రిటైర్మెంట్పై తెగ ప్రచారం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఇటీవల రోహిత్ ఫామ్ లేమితో ఇబ్బందిపడడమే. కానీ, చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఫామ్‌లోకి వచ్చి టాప్ స్కోరర్‌గా నిలిచి.. విమర్శల నోళ్లను మూయించాడు. హిట్‌మ్యాన్ కెప్టెన్సీలోనే భారత్ 2024లో టీ20 వరల్డ్ కప్ నెగ్గగా.. తాజాగా ఐసీసీ రెండో టైటిల్‌ను గెలిచింది. 2002, 2013 తర్వాత ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా భారత జట్టు మూడోసారి టైటిల్‌ను నెగ్గింది. చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ జట్టు మూడోసారి టైటిల్ గెలుచుకోలేకపోయింది. ఇక ఈ ఐసీసీ ట్రోఫీ విజేత భారత జట్టుపై కాసుల వర్షం కురిసింది.
భారత జట్టు 2.4 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ గెలుచుకుంది. అంటే భారతీయ కరెన్సీలో అక్షరాలా రూ.19.5కోట్లు. అయితే, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్‌మనీని గతంలో పోలిస్తే 53శాతం పెంచిన విషయం తెలిసిందే. రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు 1.12 మిలియన్ డాలర్ల (రూ.9.72కోట్లు) ప్రైజ్‌మనీ దక్కింది. సెమీఫైనల్లో ఎలిమినేట్ అయిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లకు రూ.4.86కోట్లు లభించాయి. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ 6.9మిలియన్ డాలర్ల (రూ.60కోట్లు) కు పెరిగిందని ఐసీసీ అధ్యక్షుడు జైషా ఒక ప్రకటనలో పెరిగిందని పేర్కొన్నారు. ఇక.. గ్రూప్ దశలో గెలిచిన జట్లకు రూ.30లక్షల ప్రైజ్‌మనీ లభించనున్నది. ఐదు, ఆరోస్థానంలో నిలిచిన జట్లకు సుమారుగా రూ.3కోట్లు.. ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.1.2కోట్ల లభించాయి. అంతేకాకుండా ఐసీసీ టోర్నీలో పాల్గొన్నందుకు ఎనిమిది జట్లకు రూ.1.08కోట్లు దక్కాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

