ట్యురిన్ : ఏటీపీ ఫైనల్స్ టెన్నిస్ టోర్నీలో స్పెయిన్ యువ ఆటగాడు కార్లోస్ అల్కారజ్‌కు ఆశాభంగం ఎదురైంది. తొలి 8 ర్యాంక్‌లలో ఉన్న ఆటగాళ్ల మధ్య జరిగే ఈ టోర్నీలో 20 ఏళ్ల అల్కారజ్ సోమవారం జరిగిన తన తొలి మ్యాచ్‌లో 7-6(3), 3-6, 4-6 స్కోరుతో రెండుసార్లు టైటిల్ విజేత అలెగ్జాండర్ జ్వెరెవ్ చేతిలో పరాజయం పాలయ్యాడు.
మరో మ్యాచ్ లో డేనియల్ మెద్వెదెవ్ 6-4, 6-2తో ఆండ్రీ రుబ్లెవ్‌పై గెలుపొందాడు. రౌండ్‌రాబిన్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో ప్రతి గ్రూపునుంచి అగ్రస్థానంలోని ఇద్దరు ఆటగాళ్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు.