Cabo Verde: సౌదీ అరేబియాతో డ్రా.. కాబో వెర్డే సంచలనం.. నాకౌట్లో అర్జెంటీనాతో ఢీ
Cabo Verde: కాబో వెర్డే సంచలనం నమోదు చేసింది. ఫిఫా వరల్డ్‌కప్‌లో నాకౌట్ స్టేజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సౌదీ అరేబియాతో హూస్టన్‌లో జరిగిన మ్యాచ్‌ను కాబో వెర్డే డ్రా చేసుకున్నది. దీంతో గ్రూప్ హెచ్లో మూడు పాయింట్లతో ఆ దేశం రెండో స్థానంలో నిలిచింది.
హూస్టన్: ఆఫ్రికా దేశం కాబో వెర్డే(Cabo Verde) సంచలనం నమోదు చేసింది. ఫిఫా వరల్డ్‌కప్‌లో నాకౌట్ స్టేజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సౌదీ అరేబియాతో హూస్టన్‌లో జరిగిన మ్యాచ్‌ను కాబో వెర్డే డ్రా చేసుకున్నది. దీంతో గ్రూప్ హెచ్లో మూడు పాయింట్లతో ఆ దేశం రెండో స్థానంలో నిలిచింది. ఆ గ్రూపు నుంచి స్పెయిన్ కూడా నాకౌట్‌కు వెళ్లింది. అయితే ఈ వరల్డ్‌కప్‌లో కాబో వెర్డే సంచలనం నమోదు చేసింది. టోర్నీలో అరంగ్రేటం చేసిన అతిచిన్న దేశంగా కాబో వెర్డే నిలిచింది. అయితే అరంగేట్రం చేసిన టోర్నీలోనే నాకౌట్‌కు వెళ్లిన జట్టుగా కూడా కాబో వెర్డే రికార్డు క్రియేట్ చేసింది. నాకౌట్ స్టేజ్‌లో అర్జెంటీనాతో కాబో వెర్డే పోటీపడనున్నది.
ఇక తన గ్రూప్ మ్యాచుల్లో స్పెయిన్, ఉరుగ్వే లాంటి జట్లను కూడా కాబో వెర్డే ధీటుగా ఎదుర్కొన్నది. ఈ టోర్నీలో ద్వీప దేశం కాబో వెర్డే తన ప్రదర్శనతో అందర్నీ స్టన్ చేసింది. ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా నాకౌట్లోకి కాబో ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. గతంలో 2002లో సెనిగల్ దేశం కూడా గ్రూప్ స్టేజ్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా నాకౌట్ దశకు వెళ్లింది. ఈ టోర్నీలో చాలా నిలకడగా కాబో వెర్డే ఆడింది. అన్ని మ్యాచ్‌లను డ్రా చేసుకున్నది. మియామిలో జూలై 3వ తేదీన మెస్సీ టీమ్‌తో కాబో వెర్డే పోటీపడనున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

