Brian Lara | నూరు శతకాల రికార్డు కోహ్లీకి అందని ద్రాక్షనే : వెస్టిండీస్ దిగ్గజం
Brian Lara : క్రికెట్లో చెక్కుచెదరని, ఎవరికీ సాధ్యం కాని రికార్డులు నెలకొల్పింది ఎవరంటే..? ఇంకెవరూ సచిన్ టెండూల్కర్ (SachinTendulkar) అని చెప్పేస్తారు ఎవరైనా. ప్రస్తుత తరంలో ఈ లెజెండరీ క్రికెటర్ వంద సెంచరీల రికార్డు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఒక్కడే...
Brian Lara : క్రికెట్లో చెక్కుచెదరని, ఎవరికీ సాధ్యం కాని రికార్డులు నెలకొల్పింది ఎవరంటే..? ఇంకెవరూ సచిన్ టెండూల్కర్ (SachinTendulkar) అని చెప్పేస్తారు ఎవరైనా. ప్రస్తుత తరంలో ఈ లెజెండరీ క్రికెటర్ వంద సెంచరీల రికార్డు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఒక్కడే చేరువగా ఉన్నాడు. అయితే.. సచిన్ నూరు శతకాల రికార్డును బ్రేక్ చేయడం విరాట్కు అంత ఈజీ కాదని వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా(Brian Lara) అన్నాడు.
‘ఇప్పుడు కోహ్లీ వయసు 35 ఏండ్లు. అతడి ఖాతాలో 80 సెంచరీలు ఉన్నాయి. సచిన్ రికార్డు సమం చేయాంటే అతడింకా 20 సార్లు మూడంకెల స్కోర్ చేయాలి. ఒకవేళ కోహ్లీ ఏడాదికి ఐదు శతకాలు బాదితే.. ఐదేండ్లలో 100 సెంచరీలు మైలురాయికి చేరుకుంటాడు. అప్పటికీ అతడికి 39 ఏండ్లు వస్తాయి. అయితే.. అది చాలా కష్టంతో కూడినది’ అని లారా అభిప్రాయపడ్డాడు.
విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్

అంతేకాదు.. కోహ్లీకి అది అసాధ్యం అని చెప్పలేను. సచిన్ 100 శతకాల రికార్డును విరాట్ బ్రేక్ చేస్తారని అంటున్నవాళ్లంతా ఒక్క లాజిక్ మిస్ అవుతున్నారు. 20 సెంచరీలు అనేది చాలా పెద్ద సంఖ్య. చాలామంది క్రికెటర్లు తమ కెరీర్లో ఆ మైలురాయికి చేరుకోవడం అసాధ్యం. అందుకనే కోహ్లీకి ఆ ఫీట్ అందని ద్రాక్ష అనేది నా అభిప్రాయం. అయితే.. ప్రపంచంలోనే ఫిట్టెస్ట్ క్రికెటర్ అయిన కోహ్లీకి వయసనేది ఒక అడ్డంకి కాదు అని లారా తెలిపాడు.

అండర్ 19 వరల్డ్ కప్ హీరోగా జట్టులోకి వచ్చిన కోహ్లీ.. సచిన్ నెలకొల్పిన రికార్డులను ఒక్కొక్కటిగా బద్ధలు కొడుతూ వస్తున్నాడు. సొంత గడ్డపై జరిగిన వరల్డ్ కప్లో విరాట్ వన్డేల్లో 50వ సెంచరీ సాధించి సచిన్ను దాటేశాడు. ప్రస్తుతానికి టెస్టులు, వన్డేల్లో ఆడుతున్న కోహ్లీ.. సచిన్ 100 శతకాల రికార్డుకు చేరువగా ఉన్నాడు. ఇంకో 20 సెంచరీలు కొడితే విరాట్ తన ఆరాధ్య ఆటగాడి సరసన నిలుస్తాడు.
ఇవి కూడా చదవండి
- MK Stalin | వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన సీఎం స్టాలిన్
- Kiara Advani | బ్లాక్ డ్రెస్లో మదిని దోచుకుంటున్న కియారా అద్వానీ..
- Spirit Of Fighter | హృతిక్ రోషన్ ‘ఫైటర్’ టీజర్ టైం ఫిక్స్.. ఎప్పుడంటే.?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

