దోహా: వరల్డ్‌కప్ ఫుట్‌బాల్ టోర్నీలో సెర్బియాతో జరిగిన గ్రూప్ జీ మ్యాచ్‌లో 2-0 గోల్స్ తేడాతో బ్రెజిల్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో స్ట్రయికర్ రిచర్లిసన్ అద్భుతమైన గోల్ చేశాడు. ఆట 73వ నిమిషంలో అతను గాలిలోకి ఎగిరి.. సీజర్ కిక్ షాట్‌తో అందర్నీ స్టన్ చేశాడు. మరో ఫార్వర్డ్ ప్లేయర్ వినిసియస్ ఇచ్చిన క్రాస్ పాస్‌ను తొలుత కంట్రోల్ చేయలేకపోయినా.. ఆ తర్వాత గాలిలో రివర్స్ కిక్‌తో గోల్ చేశాడు. దోహాలోని లుసాయిల్ స్టేడియంలోని ప్రేక్షకులు ఈ గోల్‌తో సంబరాల్లో తేలిపోయారు.
సెర్బియాతో మ్యాచ్‌లో బ్రెజిల్ రెండు గోల్స్ చేసింది. ఆ రెండు గోల్స్‌ను కొట్టింది రిచర్లిసన్. నిజానికి ఈ టోర్నీకి ముందు అతను జట్టులో ఆడేది డౌట్‌గా ఉంది. తుంటి గాయంతో బాధపడుతున్న అతను చివరి నిమిషంలో జట్టులో చేరాడు. కానీ సెర్బియాతో మ్యాచ్‌లో రిచర్లిసన్ మ్యాజిక్ గోల్‌తో తన సత్తాను చాటాడు.
బ్రెజిల్ తరపున ఆడిన గత ఏడు మ్యాచుల్లో రిచర్లిసన్ మొత్తం 9 గోల్స్ చేశాడు. ఈ టోర్నీలో ఫెవరేట్‌గా దిగిన బ్రెజిల్‌కు యువ స్ట్రయికర్ రిచర్లిసన్ మరో ఆణిముత్యంలా మారాడు. వరల్డ్‌కప్ అరంగేట్రం మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన రెండవ బ్రెజిల్ ఆటగాడిగా రిచర్లిసన్ నిలిచాడు. 2014లో నేయ్మార్ కూడా తన తొలి వరల్డ్‌కప్ మ్యాచ్‌లో రెండు గోల్స్ చేశాడు.
రిచర్లిసన్లో తన అటాకింగ్ ట్యాలెంట్‌ను అద్భుతంగా ప్రదర్శించాడు. బాల్‌ను కంట్రోల్ చేసే నైపుణ్యం కూడా అతనిలో పుష్కలంగా ఉంది. చాలా ఈజీగా గ్రౌండ్‌ను కవర్ చేస్తున్నాడు. ఆల్‌రౌండర్లు ఉన్న బ్రెజిల్.. ఈ సారి కప్‌ను ఎగురేసుకుపోతుందన్న అంచనాల్ని పెంచేసింది.
RICHARLISON WHAT A GOALL! pic.twitter.com/9SyAhhCPGj
— TC (@totalcristiano) November 24, 2022