Nikhat Zareen | ఆసియా గేమ్స్ బరిలో నిఖత్ జరీన్.. మిగతా 12 మంది బాక్సర్లు వీళ్లే..?
Nikhat Zareen : రెండు సార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ (Nikhat Zareen)మరో మెగా టోర్నమెంట్‌కు సిద్ధమవుతోంది. చైనాలో జరగనున్న 19వ ఆసియా గేమ్స్(Asian Games 2023)లో ఈ యువ సంచలనం పోటీ పడనుంది. ఈరోజు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(Boxing Federation of India) పురుషులు, మహిళలతో కూడిన 13 మంది బాక్సర్ల బృందాన్ని ప్రకటించింది. అందులో జరీన్‌తో పాటు 6 సార్లు ఆసియా చాంపియన్...
Nikhat Zareen : రెండు సార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ (Nikhat Zareen)మరో మెగా టోర్నమెంట్‌కు సిద్ధమవుతోంది. చైనాలో జరగనున్న 19వ ఆసియా గేమ్స్(Asian Games 2023)లో ఈ యువ సంచలనం పోటీ పడనుంది. టోర్నీకి సమయం దగ్గర పడడంతో ఈరోజు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(Boxing Federation of India) పురుషులు, మహిళలతో కూడిన 13 మంది బాక్సర్ల బృందాన్ని ప్రకటించింది. అందులో జరీన్‌తో పాటు ఆరు సార్లు ఆసియా చాంపియన్ శివ్ థాపా(Shiv Thapa), ఒలింపిక్ మెడల్ గెలిచిన లొవ్లినా బొర్గోహైన్( Lovlina Borgohain) ఉన్నారు.
భారత బాక్సింగ్ సమాఖ్య(BFI) అధ్యక్షడు అజయ్ సింగ్(Ajay Singh) మాట్లాడుతూ.. ఈసారి మనవాళ్లు మరోసారి దేశం గర్వించేలా చేస్తారని అన్నాడు. ‘ప్రతిష్ఠాత్మకమైన ఆసియా గేమ్స్ కోసం ఈ 13మంది బాక్సర్ల బృందం అహర్నిశలు శ్రమించింది. వీళ్లంతా మనదేశం గర్విచేలా చేస్తారనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. భారత దేశం కొన్నాళ్లుగా బాక్సింగ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రతిభావంతులైన మన బాక్సర్లు రింగ్‌లో ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్నారు. ఈసారి కూడా వీళ్లు జోరు కొనసాగించాలని కోరుకుంటున్నా. బాక్సింగ్ ఫెడరేషన్ తరఫున ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా’ అని అజయ్ సింగ్ తెలిపాడు.
𝐑𝐞𝐚𝐝𝐲 𝐭𝐨 𝐃𝐨𝐦𝐢𝐧𝐚𝐭𝐞 𝐀𝐬𝐢𝐚! 🥊💥
Presenting 🇮🇳 boxing squad for the Asian Games 2022! 💪🏆@AjaySingh_SG l @debojo_m#AsianGames#PunchMeinHaiDum#Boxing pic.twitter.com/J9vZMsPjbE
— Boxing Federation (@BFI_official) July 2, 2023
ఈ ఏడాది ఆసియా గేమ్స్ సెప్టెంబర్ 23న ప్రారంభమై, అక్టోబర్ 8న ముగుస్తాయి. రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నిఖత్ 50 కిలోల విభాగంలో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో మెరిసి లొవ్లీనా 75 కిలోల విభాగంలో, శివ్ థాపా 63.5 కిలోల విభాగంలో పోటీ పడనున్నారు. తాష్కెంట్లో జరిగిన పురుషుల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన దీపక్ భోరియా(Deepak Bhoria) 51 కిలోల కేటగిరీలో, నిశాంత్ దేవ్ 71 కిలోలో కేటగిరీలో బరిలోకి దిగనున్నారు.
లొవ్లినా బొర్గోహైన్, శివ్ థాపా

సంజీత్ కుమార్, నరేందర్ బెర్వాల్.. ఈ ఇద్దరూ 92 కిలోల విభాగంలో ఆడనున్నారు. యువ సంచలనం సచిన్(57 కిలోలు), మూడు సార్లు నేషనల్ చాంపియన్ లక్ష్య చహర్(80 కిలోలు), ప్రవీణ్ హుడా(57) జైస్మినే లంబోరియా(60), అరుంధతీ చౌదరీ(66) పతకంపై ఆశలు రేపుతున్నారు.
పురుషుల బృందం : దీపక్(51 కిలోలు), సచిన్(57 కిలోలు), శివ్ థాపా(63.5 కిలోలు), నిశాంత్ దేవ్(71 కిలోలు), లక్ష్య చాహర్(80 కిలోలు), సంజీత్(92 కిలోలు), నరేందర్(92 కిలోలు).
మహిళల బృందం : నిఖత్ జరీన్(50 కిలోలు), ప్రీతి(54 కిలోలు), ప్రవీణ్ (57 కిలోలు), జైస్మినే(60 కిలోలు), అరుంధతీ చౌదరీ(66 కిలోలు), లొవ్లినా బొర్గోహైన్ (75 కిలోలు).
ఇవి కూడా చదవండి
Nathan Lyon | నేను ఇలాగే ఒక మిత్రుడిని కోల్పోయా: కెవిన్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చిన లియాన్
West Indies | శిఖరాగ్రం నుంచి అధఃపాతాళానికి.. కరీబియన్లు లేకుండా తొలిసారి వన్డే ప్రపంచకప్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

