Nathan Lyon | నేను ఇలాగే ఒక మిత్రుడిని కోల్పోయా: కెవిన్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చిన లియాన్
Nathan Lyon : యాషెస్(Ashes) రెండో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్(Nathan Lyon) అసమాన పోరాట పటిమతో ఆకట్టుకున్నాడు. కుడి కాలి గాయం బాధిస్తున్నా లెక్కచేయకుండా రెండో ఇన్నింగ్స్‌లో ఆఖరి వికెట్‌గా బ్యాటింగ్‌కు వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అయితే... తన బదులు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ను ఆడించాలన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్(Kevin Pietersen)కు....
Nathan Lyon : యాషెస్(Ashes) రెండో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్(Nathan Lyon) అసమాన పోరాట పటిమతో ఆకట్టుకున్నాడు. కుడి కాలి గాయం బాధిస్తున్నా లెక్కచేయకుండా రెండో ఇన్నింగ్స్‌లో ఆఖరి వికెట్‌గా బ్యాటింగ్‌కు వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అయితే.. లియాన్‌ను బ్యాటింగ్‌కు పంపడాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్(Kevin Pietersen) తీవ్రంగా విమర్శించాడు. అతడి బదులు కంకషన్ సబ్‌స్టిట్యూట్(concussion substitute)ను ఆడించాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘నేను ఇలాగే ఒక మిత్రుడిని కోల్పోయా. 2014లో తలకు బంతి తగిలి ఫిలిఫ్ హ్యూస్(Phillip Hughes) మైదానంలోనే ప్రాణాలు విడిచాడు అని గుర్తు చేశాడు. పీటర్సన్ వ్యాఖ్యలపై చిర్రెత్తుకొచ్చిన లియాన్ గట్టి కౌంటర్ ఇచ్చాడు.
‘టెస్టు క్రికెట్ ఎన్నో ఏళ్లనాటిది. ఆట అన్నాక గాయాలు సహజమే. నేను బ్యాటింగ్‌కు రావడంపై కొందరు తప్పుడు వ్యాఖ్యాలు చేశారని విన్నాను. తలకు బంతిని తగిలించుకునేందుకు క్రీజులోకి వెళ్లానని అనడం అబద్ధం. అయితే.. పీటర్సన్ చెప్పిన ఫిలిఫ్ హ్యూస్ ఉదాహరణ సరికాదు’ అని లియాన్ అన్నాడు. అంతేకాదు.. ‘తలకు బలమైన గాయం అయినప్పుడే కంకషన్ సబ్‌స్టిట్యూట్(concussion substitute)ను అనుమతిస్తారు. కానీ, అది రిస్క్‌తో కూడినది. నాకు ఆ పరిస్థితి ఎదరుకానందుకు చాలా సంతోషంగా ఉంది’ అని ఈ స్టార్ స్పిన్నర్ తెలిపాడు.
పదో వికెట్‌గా వెనుదిరిగిన లియాన్

పోరాడుతున్న ఇంగ్లండ్
లార్డ్స్ టెస్టు(Lords Test)లో రెండో రోజు ఫీల్డింగ్ చేస్తుండగా లియాన్ గాయపడ్డాడు. నొప్పితో విలవిలలాడుతూ మైదానం వీడిన అతను మూడో రోజు చేతి కర్రల సాయంతో నడుస్తూ కనిపించాడు. దాంతో, అతను ఇక ఈ మ్యాచ్ ఆడడం కష్టమే అనుకున్నారంతా. కానీ, లియాన్ పదో వికెట్‌గా బ్యాటింగ్‌కు వచ్చాడు. కాలి నొప్పిని పంటిబిగువునా భరిస్తూ మిచెల్ స్టార్క్(Mitchell Starc)కు సహకారం అందించాడు. అయితే.. బ్రాడ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పెవిలియన్‌కు వెళ్తున్న అతడికి ఆసీస్ ఆటగాళ్లకు చప్పట్లతో స్వాగతం పలికారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 279 వద్ద ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఆఖరి సెషన్లో 115 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ బెన్ డకెట్(51), కెప్టెన్ బెన్ స్టోక్స్(29) మరో వికెట్ పడకుండా చూసుకున్నారు. ఆసీస్ పేస్ దళాన్ని ఎదుర్కొని రోజంతా నిలబడడం అతిథ్య జట్టుకు కష్టమే. తొలి టెస్టులో గెలిచిన ప్యాట్ కమిన్స్ సేన 1-0తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

