IPL 2024 RR vs LSG ఐపీఎల్ 17వ సీజన్ తొలి మ్యాచ్‌లోనే రాజస్తాన్ రాయల్స్ పేసర్ ట్రెంట్ బౌల్ట్(Trent Boult) నిప్పులు చెరుగుతున్నాడు. ఈ స్పీడ్‌స్టర్ తన బుల్లెట్ లాంటి బంతులతో లక్నో టాపార్డర్‌ను కూల్చాడు. డేంజరస్ ఓపెనర్ క్వింటన్ డికాక్(4), డేవ్దత్ పడిక్కల్(0)ను ఔట్ చేసి లక్నోను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు.
నంద్రె బర్గర్ ఓవర్లో ఆయుష్ బదౌనీ(1) సులువైన క్యాచ్ ఇచ్చి వెనుదరిగాడు. దాంతో, 194 పరుగుల ఛేదనలో లక్నో 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కెప్టెన్ కేఎల్ రాహుల్(2), ఇంపాక్ట్ ప్లేయర్ దీపక్ హుడా(16)లు ఆడుతున్నారు. 4.2 ఓవర్లకు స్కోర్.. 27/3.
1-1 ⚡🔥 pic.twitter.com/zCVPH4srVi
— Rajasthan Royals (@rajasthanroyals) March 24, 2024
జైపూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ కొట్టింది. కెప్టెన్ సంజూ శాంసన్(82 నాటౌట్ 51 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఈ ఏడాది రంజీల్లో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్(43) సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. దాంతో, రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 స్కోర్ చేయగలిగింది. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ రెండు, మొహ్సిన్ ఖాన్ ఒక వికెట్ తీశారు.