IPL 2024 RR vs MI : తొలి ఓవర్లోనే విక్ట్ తీసే అలవాటున్నట్రెంట్ బోల్ట్ ముంబైని ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఐదో బంతికే డేంజరస్ రోహిత్ శర్మ(0) ను డకౌట్‌గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత బంతికి నమన్ ధిర్(0)ను ఎల్బీగా ఔట్ చేశాడు. నమన్ వెంటనే రివ్యూ తీసకున్నా ఫలితం లేకపోయింది. దాంతో, ముంబై రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషన్(1) క్రీజులో ఉన్నాడు.
వరుసగా రెండు వికెట్లు పడడంతో ముంబై ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్రెవిస్‌ను తీసుకుంది. ఐపీఎల్లో 17 సార్లు డకౌట్ అయిన రెండో క్రికెటర్‌గా హిట్‌మ్యాన్ రికార్డు నెలకొల్పాడు. దినేశ్ కార్తిక్‌తో కలిసి మొదటి స్థానంలో నిలిచాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ 15 డకౌట్లతో రెండో స్ఠానంలో ఉన్నాడు.