Rohan Bopanna | భళా బొపన్న.. లేటు వయసులో సంచలనాలు నమోదు చేస్తున్న సీనియర్ ప్లేయర్
భారత సీనియర్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న లేటు వయసులో సంచలనాలు నమోదు చేస్తున్నాడు. అతి పెద్ద వయసులో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరి రికార్డు సృష్టించిన బోపన్న ఇప్పుడు కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో బోపన్న.. ఫైనల్‌కు చేరాడు.
Rohan Bopanna | మెల్బోర్న్: భారత సీనియర్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న లేటు వయసులో సంచలనాలు నమోదు చేస్తున్నాడు. అతి పెద్ద వయసులో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరి రికార్డు సృష్టించిన బోపన్న ఇప్పుడు కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో బోపన్న.. ఫైనల్‌కు చేరాడు. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో గురువారం రోహన్ బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ జోడీ 6-3, 3-6, 7-6 (10/7)తో జాంగ్-మచక్ జంటపై విజయం సాధించింది. నిర్ణయాత్మక మూడో సెట్లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనా.. టైబ్రేకర్‌లో బోపన్న ద్వయం పైచేయి సాధించింది. 2013, 2013లో యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరిన బోపన్నకు ఇది మూడో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ మరి ఈ సారైనా టైటిల్ అందుకుంటాడా చూడాలి. మరోవైపు బోపన్న సహా ఆరుగురు క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది.
ఫైనల్లో సబలెంక
అమెరికా యువ సంచలనం కోకో గాఫ్‌కు ఆస్ట్రేలియా ఓపెన్‌లో చుక్కెదురైంది. గురువారం సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సబలెంక చేతిలో గాఫ్ ఓడింది. హోరాహోరీగా సాగిన పోరులో రెండో సీడ్ సబలెంక 7-6 (7/2), 6-4తో గాఫ్‌ను ఓడించింది. మరో సెమీస్‌లో జెంగ్ 6-4, 6-4తో యస్త్రంస్కాపై నెగ్గింది. పురుషుల సింగిల్స్‌లో జ్వెరెవ్, మెద్వెదెవ్ సెమీఫైనల్లో అడుగుపెట్టారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

