Wimbledon 2023 : వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్(Mixed Doubles)లో రోహన్ బోపన్న(Rohan Bopanna) జోడికి చుక్కెదురైంది. ఆరో సీడ్ బోపన్న, గాబ్రియెల డబ్రోవ్స్కీ(Gabriela Dabrowski) రెండో రౌండ్లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించారు. మాజీ వింబుల్డన్ చాంపియన్ ఇవన్ డోడిగ్(Ivan Dodig), లతిశ చాను(Latisha Chan) చేతిలో వరుస సెట్లలో 7-6 (7-5), 3-6, 4-6తో పరాజయం పాలయ్యారు. దాంతో, ఈ ఏడాది టైటిల్ నెగ్గాలనుకున్న బోపన్న కల చెదిరింది.
ఈ భారత టెన్నిస్ స్టార్ చివరి ఇప్పటివరకు ఒకే ఒక గ్రాండ్ స్లామ్(Grandslam) టైటిల్ సాధించాడు. 2017 ఫ్రెంచ్ ఓపెన్(French Open 2017)లో గాబ్రియెలతో కలిసి మిక్స్డ్ డబుల్స్ విజేతగా నిలిచాడు. పురుషుల డబుల్స్‌లో బోపన్న- మాథ్యూ ఎబ్డెన్(Matthew Ebden) జోడీ రెండో రౌండ్లో అడుగు పెట్టింది.
మాథ్యూ ఎబ్డెన్ – రోహన్ బోపన్న
అర్జెంటీనాకు చెందిన గిల్లెర్మో డ్యురాన్, థామస్ మార్టిన్ ఎట్చెవెర్రీని 6-2, 6-7(5-7), 7-6(10-8)తో ఓడించింది. ప్రీ క్వార్టర్ ఫైనల్లో బోపన్న – మాథ్యూ ద్వయం బ్రిటన్‌కు చెందిన జాకబ్ ఫియర్న్లే, జొహన్నస్తో సోమవారం తలపడనుంది.