Rohan Bopanna | భళా బోపన్న.. ఆస్ట్రేలియా ఓపెన్ డబుల్స్ టైటిల్ కైవసం.. గ్రాండ్‌స్లామ్ నెగ్గిన అతి పెద్ద వయస్కుడిగా రికార్డ్
వయసు ఒక సంఖ్య మాత్రమే అని చాటుతూ.. భారత సీనియర్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న సంచలనం నమోదు చేశాడు. లేటు వయసులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన పురుష టెన్నిస్ ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ జంట 7-6 (7/0), 7-5తో సిమోన్ బొలెల్లి-అండ్రె వావ్సోరీ (ఇటలీ) ద్వయంపై గెలిచింది.
- ఫైనల్లో ఇటలీ జోడీపై జయభేరి
- మహిళల చాంప్సబలెంక
అతి పెద్ద వయసు (43)లో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన ప్లేయర్‌గా రోహాన్ బోపన్న రికార్డుల్లోకెక్కాడు.
బోపన్నకు ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2017లో గాబ్రెలాతో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెలిచాడు.
Rohan Bopanna | రోహన్ బోపన్న అద్భుతం చేశాడు! అద్వితీయ ఆటతీరుతో విజృంభించిన ఈ సీనియర్ ప్లేయర్.. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేజిక్కించుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఇటలీ జంటపై బోపన్న-ఎబ్డెన్ జోడీ ఘనవిజయం సాధించింది. ఇప్పటి వరకు ఒక మిక్స్డ్ డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన బోపన్న.. 43 ఏండ్ల వయసులో డబుల్స్ టైటిల్ గెలిచి ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సబలెంక టైటిల్ గెలుచుకుంది.
మెల్బోర్న్: వయసు ఒక సంఖ్య మాత్రమే అని చాటుతూ.. భారత సీనియర్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న సంచలనం నమోదు చేశాడు. లేటు వయసులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన పురుష టెన్నిస్ ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ జంట 7-6 (7/0), 7-5తో సిమోన్ బొలెల్లి-అండ్రె వావ్సోరీ (ఇటలీ) ద్వయంపై గెలిచింది. రెండో సీడ్‌గా బరిలోకి దిగిన బోపన్న జోడీ.. 8 ఏస్‌లు కొట్టి 26 విన్నర్లు కొట్టింది. మరోవైపు ప్రత్యర్థి జంట ఒక ఏస్ మాత్రమే సంధించి 15 విన్నర్లకు పరిమితమైంది. గంట 39 నిమిషాల పాటు సాగిన పోరులో రోహన్ ద్వయం 4 డబుల్ ఫాల్ట్స్ చేస్తే.. ఇటలీ ప్లేయర్లు 6 రిటర్న్ అనవసర తప్పిదాలు చేశారు. ఇప్పటి వరకు భారత్ నుంచి లియాండర్‌పేస్-మహేశ్ భూపతి జంట మాత్రమే మేజర్ టైటిల్స్ నెగ్గగా.. మహిళల విభాగంలో సానియా మీర్జా ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఖాతాలో వేసుకుంది. 2017 ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ నెగ్గిన బోపన్నకు ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కాగా.. పురుషుల డబుల్స్‌లో మూడోసారి ఫైనల్ చేరి విజేతగా నిలిచాడు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బోపన్నకు పద్మశ్రీ అవార్డు ప్రకటించగా.. తాజా ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ కూడా అందుకున్నాడు. బోపన్న జంటకు దాదపు 4 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది.
క్వీన్ సబలెంక

మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అరియానా సబలెంక రెండో టైటిల్ ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సబలెంక (బెలారస్) 6-3, 6-2తో జెంగ్ (చైనా)పై విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో రెండో సీడ్ సబలెంక పూర్తి ఆధిపత్యం కనబర్చింది. గంట 16 నిమిషాల పాటు సాగిన తుదిపోరులో జెంగ్ 6 ఏస్‌లు కొట్టగా.. మూడు ఏస్‌లకే పరిమితమైన సబలెంక 14 విన్నర్లు సంధించింది. మ్యాచ్ అనంతరం సబలెంక మాట్లాడుతూ.. ‘నమ్మశక్యంగా లేదు. ఈ టోర్నీ అద్భుతంగా సాగింది’ అని పేర్కొంది.
కొన్నేండ్ల క్రితం వరుసగా.. ఐదు నెలల పాటు ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేదు. ఆ సమయంలో ఇక రిటైర్మెంట్ ప్రకటించడమే మేలు అనుకున్నా. కానీ.. ఏదో సాధించాలనే తపన నన్ను ఇక్కడి వరకు వచ్చింది. మాథ్యూతో చక్కటి అనుబంధం ఉంది. అదే మ్యాచ్‌లో ప్రస్ఫుటమైంది. మీరు కూడా పోరాటాన్ని వదలొద్దు. ప్రయత్నిస్తేనే ఫలితాలు వస్తాయి.
-రోహన్ బోపన్న
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

