Miami Open | బోపన్న జోడీ రఫ్ఫాట.. అద్భుత విజయంతో సెమీస్‌కు
Miami Open : ప్రతిష్ఠాత్మక మియామి ఓపెన్‌లో(Miami Open 2024) రోహన్ బోపన్న(Rohan Bopanna) మాథ్యూ ఎబ్డెన్ జోడీ రఫ్ఫాడిస్తోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ ద్వయం సెమీస్‌లో కాలు మోపింది. మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బోపన్న..
Miami Open : ప్రతిష్ఠాత్మక మియామి ఓపెన్‌లో(Miami Open 2024) భారత స్టార్ ఆటగాడు రోహన్ బోపన్న(Rohan Bopanna) మాథ్యూ ఎబ్డెన్ జోడీ రఫ్ఫాడిస్తోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ ద్వయం సెమీస్‌లో కాలు మోపింది. మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బోపన్న ద్వయం సీబ్ వీర్బీక్, జాన్ పాట్రిక్ స్మిత్‌ను చిత్తు చేసింది. 3-6, 7-6, 10-7తో మ్యాచ్ ముగించి దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టింది. ఫెనల్ బెర్తుకోసం జరిగే పోరులో ఈ జంట.. గ్రానొల్లెర్స్, జెబల్లోస్ లేదా గ్లాస్‌పూల్, రోజర్ జోడీని ఢీకొట్టనుంది.
ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌తో బోపన్నజోడీ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 43 ఏండ్ల వయసులో ట్రోఫీ గెలిచిన బోపన్న భారత్‌కు మూడో గ్రాండ్‌స్లామ్ సాధించి పెట్టాడు. నిరుడు నుంచి బోపన్న – మథ్యూ జోడీ అద్భుత విజయాలు సాధిస్తూ వస్తోంది. అయితే.. దుబాయ్ చాంపియన్‌షిప్స్, ఇండియన్ వెల్స్ టోర్నీలో ఈ జంట అనూహ్యంగా ఓటమి పాలైంది. దాంతో డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో బోపన్న, మాథ్యూస్‌లు అగ్రస్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయారు.
ఇవి కూడా చదవండి
- Megastar Chiranjeevi | కర్ణాటకలో కరువు.. స్పెషల్ పోస్ట్ పెట్టిన మెగాస్టార్ చిరంజీవి
- You tube | భారత్‌లో 22.5లక్షల వీడియోలు డిలీట్ చేసిన యూట్యూబ్..! కారణాలు ఏంటంటే..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

