You tube | భారత్‌లో 22.5లక్షల వీడియోలు డిలీట్ చేసిన యూట్యూబ్..! కారణాలు ఏంటంటే..?
You tube | గూగుల్ యాజమాన్యంలో యూట్యూబ్ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారత్‌లో 22.5లక్షల వీడియోలను తొలగించింది. కమ్యూనిటీ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు వీడియోలను తొలగించినట్లు యూట్యూబ్ తెలిపింది.
You tube | గూగుల్ యాజమాన్యంలో యూట్యూబ్ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారత్‌లో 22.5లక్షల వీడియోలను తొలగించింది. కమ్యూనిటీ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు వీడియోలను తొలగించినట్లు యూట్యూబ్ తెలిపింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా 90లక్షల వీడియోలను తొలగించినట్లు ఓ నివేదిక పేర్కొంది. ఈ వీడియోల్లో 96శాతం కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించినట్లు గుర్తించామని.. అయితే 53.46శాతం వీడియోలు ఒక వ్యూ రాక ముందే తొలగించినట్లు నివేదిక పేర్కొంది.
కమ్యూనిటీ మార్గదర్శకాల్లో స్పమ్, సున్నితమైన కంటెంట్, హింసాత్మక కంటెంట్, తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్ మొదలైనవి ఉన్నాయి. ఇక అక్టోబర్-డిసెంబర్ 2023 మధ్య 2కోట్ల ఛానెల్స్‌ను సైతం డిలీట్ చేసింది. గత త్రైమాసికంతో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపుగా ఉందని నివేదిక పేర్కొంది. అయితే, ఛానెల్స్‌ను రద్దు చేసిన సమయంలో వీడియోలు సైతం తొలగించనున్న విషయం తెలిసిందే.
ఈ వ్యవహారంలో 9 కోట్లకుపైగా వీడియోలు తొలగించినట్లు యూట్యూబ్ పేర్కొంది. ఛానెల్స్ తొలగింపునకు ప్రధాన కారణాల్లో స్పామ్, తప్పుదారి పట్టించే కంటెంట్ 92.8శాతం ఉందని.. 4.5శాతం అశ్లీల కంటెంట్ ఉందని పేర్కొంది. అయితే, యూట్యూబ్ 90 రోజుల్లో మూడుసార్లు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే యూట్యూబ్ ఛానెల్‌ను రద్దు చేస్తుంది. భారత్‌లో 22.5లక్షల వీడియోలను తొలగించగా.. ఆ తర్వాత సింగపూర్ (,124,387), అమెరికాలో (7,88,354) వీడియోలను తొలగించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

