ఇండియాను ఓడిస్తే.. పాక్ క్రికెటర్లకు బ్లాంక్ చెక్!

ఇస్లామాబాద్: హై వోల్టేజ్ మ్యాచ్ కోసం అప్పుడే వెదర్ హీటెక్కింది. అక్టోబర్ 24న జరగనున్న ఇండో-పాక్ సమరానికి ఫుల్ క్రేజీ పెరుగుతోంది. టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో ఆడనున్నది. అయితే ఆ మ్యాచ్‌లో ఒకవేళ పాకిస్థాన్ గెలిస్తే, అప్పుడు ఆ టీమ్ సభ్యులకు బ్లాంక్ చెక్ ఇస్తానని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా ప్రకటించినట్లు తెలుస్తోంది. దుబాయ్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో బాబర్ ఆజమ్ టీమ్‌తో కోహ్లీ సేన 24వ తేదీన తలపడనున్నది. అయితే దీని గురించి పాక్ సేనేట్ స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో చర్చ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో పీసీబీ చైర్మెన్ రమీజ్ రాజా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ ఇచ్చిన 50 శాతం నిధులతోనే పీసీబీ నడుస్తోందని, అలాగే ఐసీసీకి 90 శాతం ఫండింగ్ ఇండియా నుంచి అందుతుందని, ఒకవేళ ఇండియా తన నిధులను ఐసీసీకి ఆపడం నిలిపివేస్తే, అప్పుడు పీసీబీ కుప్పకూలుతుందని, ఎందుకంటే ఐసీసీకి పీసీబీ నయా పైసా ఇవ్వడంలేదని రమీజ్ రాజా అన్నారు. పాకిస్థాన్ క్రికెట్‌ను బలోపేతం చేయాలనుకున్నానని, అయితే ఓ పెద్ద ఇన్వెస్టర్ భారీ ఆఫర్ ఇచ్చాడని, ఒకవేళ ఇండియాను వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఓడిస్తే, పాక్ జట్టుకు బ్లాంక్ చెక్ ఇచ్చేందుకు ఆ ఇన్వెస్టర్ ముందుకు వచ్చినట్లు పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా తెలిపారు. ఉత్తమమైన క్రికెట్ జట్టు ఉండాలంటే, బలమైన ఆర్థిక వ్యవస్థ కూడా కీలకమని రాజా అన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

