హైదరాబాద్: క్రికెట్ అక్షర్ పటేల్ బర్త్ డే ఇవాళ. 29వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఆ ఆల్‌రౌండర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. గత ఏడాది బర్త్ డే రోజే గర్ల్‌ఫ్రెండ్ మెహాను ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి నేపథ్యంలోనే ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌కు అతను దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్షర్ పటేల్ కాబోయే శ్రీమతి ఓ డైటీషియన్. ప్రొఫెషన్ రీత్యా ఆమె న్యూట్రిషియనిస్ట్ కూడా. గుజరాత్‌లోని నదియాద్ సిటీలో ఆమె పుట్టింది. గత ఏడాది బ్రిటన్ టూర్ సమయంలో అక్షర్‌తో పాటు మెహా కనిపించింది. మెహా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెకు ఇన్‌స్టాలో 23 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.