Tiger Woods | గోల్ఫ్ కింగ్ టైగర్ వుడ్స్‌కు ఊరట.. రూ.200 కోట్ల దావాపై వెనక్కి తగ్గిన మాజీ ప్రేయసి
Tiger Woods : గోల్ఫ్ కింగ్ టైగర్ వుడ్స్(Tiger Woods)కు భారీ ఊరట లభించింది. మాజీ ప్రేయసి ఎరికా హెర్మన్(Erica Herman) అతడిపై కోర్టులో వేసిన రూ.200 కోట్ల దావాను వెన్కక్కి తీసుకుంది. టైగర్ వుడ్స్ ఎస్టేట్‌లోని బంగ్లా నుంచి తనను బలవంతంగా ఖాళీ చేయించాడని హెర్మన్ 2022 అక్టోబర్‌లో కోర్టులో అతడిపై..
Tiger Woods : గోల్ఫ్ కింగ్ టైగర్ వుడ్స్(Tiger Woods)కు భారీ ఊరట లభించింది. మాజీ ప్రేయసి ఎరికా హెర్మన్(Erica Herman) అతడిపై కోర్టులో వేసిన రూ.200 కోట్ల దావాను వెన్కక్కి తీసుకుంది. టైగర్ వుడ్స్ ఎస్టేట్‌లోని బంగ్లా నుంచి తనను బలవంతంగా ఖాళీ చేయించాడని హెర్మన్ 2022 అక్టోబర్‌లో కోర్టులో అతడిపై కేసు వేసింది. అందుకుగానూ తనకు 30 మిలియన్ డాలర్లు (రూ.200 కోట్లకు పైగా) పరిహారంగా ఇవ్వాలని ఆమె కోర్టును కోరింది.
ఫ్లోరిడా రెసిడెన్షియల్ టెనంట్ చట్టం(Florida Residential Landlord Tenant Act) ప్రకారం చేసుకున్న ఒప్పందాన్ని వుడ్స్ ఉల్లంఘించాడని ఆమె తన ఫిర్యాదులో తెలిపింది. అయితే.. ఆమె తన నిర్ణయం మార్చుకొని ఈమధ్యే కేసు వాపసు తీసుకుంది.
ఎరికా హెర్మన్, టైగర్ వుడ్స్

వుడ్స్, హెర్మన్ 2015లో ప్రేమలో పడ్డారు. దాంతో, వుడ్స్ ఫ్లోరిడాలోని తన ఎస్టేట్‌లో హెర్మన్ ఉండేందుకు ఓ గదిని అద్దెకు ఇచ్చాడు. ఆ సమయంలో అతను బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసుకోలేదు. అయితే.. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2022లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ, వుడ్స్ తనను బలవంతంగా ఎస్టేట్ గది నుంచి పంపించాడని హెర్మన్ కోర్టును ఆశ్రయించింది. తనకు పరిహారంగా 30 మిలియన్ డాలర్లు ఇప్పించాలని కోరింది.
ఇవి కూడా చదవండి
Team India – Pakistan | టెస్టు ర్యాంకింగ్స్‌లో దాయాది జట్ల జోరు.. తొలిసారి అగ్రస్థానంలో భారత్, పాకిస్థాన్
Team India – Pakistan | టెస్టు ర్యాంకింగ్స్‌లో దాయాది జట్ల జోరు.. తొలిసారి అగ్రస్థానంలో భారత్, పాకిస్థాన్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

