Josh Hazlewood | ఆసీస్‌కు పెద్ద షాక్.. టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు స్టార్ పేసర్ దూరం
Josh Hazlewood : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్(WTC Final 2023)కు ముందు ఆస్ట్రేలియాకు పెద్ద షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్(Josh Hazlewood) ఫైనల్ మ్యాచ్‌కు దూరం కానున్నాడు. అషెల్లెస్(Achilles) గాయం తిరగబెట్టడంతో అతను టోర్నీ నుంచి తప్పుకోనున్నాడు. అతడి స్థానాన్ని ఆల్‌రౌండర్...
Josh Hazlewood : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్(WTC Final 2023)కు ముందు ఆస్ట్రేలియాకు పెద్ద షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్(Josh Hazlewood) ఫైనల్ మ్యాచ్‌కు దూరం కానున్నాడు. అషెల్లెస్(Achilles) గాయం తిరగబెట్టడంతో అతను టోర్నీ నుంచి తప్పుకోనున్నాడు. అతడి స్థానాన్ని ఆల్‌రౌండర్ మైఖేల్ నసెర్(Michael Neser) భర్తీ చేయనున్నాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల అనుభవం ఉన్న నసెర్ ఈ మధ్య అద్భుతంగా రాణించాడు. యార్క్‌షైర్(Yorkshire) జట్టుపై అతను 732తో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.
అయితే.. తుది జట్టులో అతడికి చోటు దక్కుతుందా? లేదా? అనేది తెలియదు. ఎందుకంటే.. భారత పర్యటనలో ఆకట్టుకున్న స్కాట్ బోలాండ్(Scott Boland) రేసులో ఉన్నాడు. అతను ఇంగ్లండ్ పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేయగలడు. దాంతో, కోచ్ మెక్‌డొనాల్డ్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అతడికి అవకాశం ఇచ్చే అవకాశం లేకపోలేదు.
మైఖేల్ నసెర్

యాషెస్ సిరీస్ వరకైనా
స్వదేశంలో దక్షిణాఫ్రికా సిరీస్‌లో గాయపడిన హేజిల్‌వుడ్ బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ(Border – Gavaskar Trophy)లో ఆడలేదు. ఐపీఎల్ 16వ సీజన్లోనూ రెండు మ్యాచ్‌లే ఆడాడు. టోర్నీ మధ్యలోనే ఆస్ట్రేలియాకు వెళ్లిన అతను ఈ మధ్యే ఫిట్నెస్ సాధించాడు. దాంతో, ఆసీస్ బౌలింగ్ యూనిట్ బలంగా మారిందనుకున్నారంతా.

కానీ, అంతలోపే అతడికి గాయం తిరగబెట్టింది. దాంతో, కోచ్ మెక్‌డొనాల్డ్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ స్పీడ్‌స్టర్‌కు విశ్రాంతి ఇవ్వాలనుకున్నారు. అయితే.. ఇంగ్లండ్‌తో ఈ నెలలోనే కీలకమైన యాషెస్ సిరీస్(Ashesh Series) ఉంది. ఆలోపు హేజిల్‌వుడ్ కోలుకోవాలని ఆస్ట్రేలియా కోరుకుంటోంది. జూన్ 16న యాషెస్ తొలి టెస్టు జరగనుంది. మొత్తం 5 మ్యాచ్‌ల సిరీస్ ఇది. ఇప్పటికే ఇంగ్లండ్ తొలి రెండు టెస్టులకు 15 మంది బృందాన్ని ప్రకటించింది. టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత ఆసీస్ ఆటగాళ్లు యాషెస్‌కు సన్నద్ధం కానున్నారు.
ఇవి కూడా చదవండి
SL vs AFG | ఈ ఏడాది వన్డేల్లో శ్రీలంక తొలి విజయం.. అఫ్గనిస్థాన్‌తో సిరీస్ సమం
Shane Warne | షేన్ వార్న్ ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’కి నేటితో 30 ఏళ్లు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

