IPL 2023 | న్యూఢిల్లీ: ఐపీఎల్ 16వ సీజన్ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు.. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సారథ్యంలో బరిలోకి దిగనుంది. రెగ్యులర్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్మ్ మొదటి పోరుకు అందుబాటులో లేకపోవడంతో భువనేశ్వర్‌కు జట్టు పగ్గాలు అప్పగించారు. తాజా సీజన్లో హైదరాబాద్ తొలి పోరులో ఆదివారం ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ప్రస్తుతం మార్క్మ్ దక్షిణాఫ్రికా తరఫున నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్ ఆడుతుండగా.. అది ముగియగానే నేరుగా జట్టుతో కలువనున్నాడు.