బెన్ స్టోక్స్ చేతివేలుకు సర్జరీ..

హైదరాబాద్: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్.. ఐపీఎల్ మ్యాచ్‌లో గాయపడ్డ విషయం తెలిసిందే. పంజాబ్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ బెన్ స్టోక్స్‌కు గాయమైంది. అతని ఎడమ చేతి చూపుడు వేలులో చీలిక వచ్చింది. ఎక్స్‌రే స్కానింగ్‌లో ఈ విషయం బయటపడింది. దీంతో ఆ వేలుకు సర్జరీ చేయనున్నారు. శస్త్ర చికిత్స కోసం బెన్ స్టోక్స్ ఇవాళ ఇంగ్లండ్ వెళ్లనున్నాడు. 12 వారాల పాటు అతను క్రికెట్‌కు దూరం కానున్నట్లు తెలిసింది. ఈ ఏడాది జూన్‌లో న్యూజిలాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్ కు బెన్ స్టోక్స్ దూరంకానున్నాడు. సోమవారం రోజున లీడ్స్‌లో స్టోక్స్ సర్జరీ చేయించుకోనున్నాడు. శ్రీలంక, పాకిస్థాన్‌తో జరగనున్న సిరీస్‌లకు కూడా స్టోక్స్ అందుబాటులోకి వచ్చేది డౌట్‌గానే ఉన్నది. ఆగస్టు, సెప్టెంబర్‌లో భారత్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో కూడా స్టోక్స్ ఆడేది అనుమానంగా ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Jagadish Reddy | తెలంగాణ నీటి హక్కులను సీఎం తన గురువు చంద్రబాబు చేతిలో పెట్టిండు : జగదీష్‌రెడ్డి
KTR | బక్క పలచని యోధుడు బానిస సంకెళ్లు తెంచిన కథ.. మన తెలంగాణ జాతి కథ : కేటీఆర్
Health Tips | నిమ్మరసాన్ని దేంట్లో పడితే దాంట్లో వాడుతున్నారా .. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
KTR | ఉద్యమానికి ఊపిరులూదిన కరీంనగర్ ఖిల్లా ఇది : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

