రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన విడుదల చేసిన బీసీసీఐ
క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తున్న సమయంలో పంత్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్‌ను డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, పంత్ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా బీబీసీఐ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం పంత్‌కు చికిత్స జరుగుతోందని.. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపింది. అయితే, పంత్ నుదురు చిట్లిందని,
Rishabh Pant | క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తున్న సమయంలో పంత్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్‌ను డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, పంత్ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా బీబీసీఐ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం పంత్‌కు చికిత్స జరుగుతోందని.. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపింది. అయితే, పంత్ నుదురు చిట్లిందని, వీపుపై కాలిన గాయాలు ఉన్నట్లు పేర్కొంది. దీంతోపాటు కుడి మోకాలి లిగ్మెంట్ కదిలినట్లు ఎక్స్‌రేల్లో తేలినట్లు వెల్లడించింది.
మరోవైపు ఈ ఘటనపై బీసీసీఐ కార్యదర్శి జైషా స్పందించారు. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ట్రీట్మెంట్ జరుగుతోందని చెప్పారు. ఇప్పటికే పంత్ కుటుంబ సభ్యులతో మాట్లాడానన్నారు. వైద్యులతో కూడా సంప్రదింపులు జరిపినట్లు చెప్పారు. పంత్ ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామన్న జైషా.. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Media Statement – Rishabh Pant
The BCCI will see to it that Rishabh receives the best possible medical care and gets all the support he needs to come out of this traumatic phase.
Details here 👇👇https://t.co/NFv6QbdwBD
— BCCI (@BCCI) December 30, 2022
My thoughts and prayers are with Rishabh Pant as he fights his way back to recovery. I have spoken to his family and the doctors treating him. Rishabh is stable and undergoing scans. We are closely monitoring his progress and will provide him with all the necessary support.
— Jay Shah (@JayShah) December 30, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

