Anshuman Gaekwad | క్యాన్సర్‌తో పోరాడుతున్న గైక్వాడ్.. బీసీసీఐ ఆర్థిక సాయం
ఏడాదికాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్‌కు బీసీసీఐ కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ మేరకు కార్యదర్శి జై షా బీసీసీఐ అధికారులను ఆదేశించినట్టు బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
Anshuman Gaekwad | ఢిల్లీ: ఏడాదికాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్‌కు బీసీసీఐ కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ మేరకు కార్యదర్శి జై షా బీసీసీఐ అధికారులను ఆదేశించినట్టు బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ‘క్యాన్సర్ బారినపడ్డ భారత మాజీ క్రికెటర్ అన్షుమన్‌కు తక్షణ సాయం కింద కోటి రూపాయలను విడుదల చేయాలని కార్యదర్శి జై షా ఆదేశించారు. ఆయన కుటుంబసభ్యులతోనూ జై షా మాట్లాడారు. గైక్వాడ్ కుటుంబానికి బీసీసీఐ అండగా ఉంటుంది’ అని ప్రకటనలో పేర్కొంది.
బ్లడ్ క్యాన్సర్‌తో లండన్‌లోని కింగ్స్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గైక్వాడ్‌కు తన మాజీ సహచర ఆటగాళ్లు కపిల్‌దేవ్, గవాస్కర్, సందీప్ పాటిల్ వంటి పలువురు సాయమందిస్తున్నారు. ఈ విషయాన్ని సందీప్ పాటిల్ ముందుగా బీసీసీఐ దృష్టికి తీసుకువచ్చాడు. 1975 నుంచి 1987 దాకా భారత్ తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడిన గైక్వాడ్.. టీమ్ఇండియాకు రెండుమార్లు హెడ్‌కోచ్‌గా కూడా పనిచేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CV Anand | ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అలర్జీ.. డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు!
Delimitation | అసెంబ్లీ సీట్ల గరిష్ఠ పరిమితి 650కి పెంపు.. లోక్‌సభలో 80 నుంచి 120కి స్థానాల పెంపు
Delimitation | పట్టణాలదే పెత్తనం.. నియోజకవర్గాల పునర్విభజనతో భారీ మార్పులు!
Kadiyam Srihari | కడియం వీడియోను కూడా చూపాలి.. ఎథిక్స్ కమిటీ మీటింగ్‌లో బీఆర్ఎస్ సభ్యుల పట్టు
Deeksha Divas | దీక్ష రోజున కేసీఆర్ షాడో నేనే.. నాటి అనుభవాలు పంచుకున్న ఏసీపీ శ్రీధర్!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

