Big Bash League: స్టోయినిస్ మెరుపులతో ‘మెల్బోర్న్’కు న్యూఈయర్ పార్టీ..
Big Bash League: ప్రత్యర్థి జట్టు భారీ టార్గెట్‌ను విధించినా స్టోయినిస్ ఆ టార్గెట్‌ను ‘ఉఫ్’మని ఊదిపారేసాడు. 19 బంతుల్లోనే ఆరు బౌండరీలు, నాలుగు భారీ సిక్సర్లతో చెలరేగి 206 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలుండగానే పూర్తిచేశాడు.
Big Bash League: ఆసీస్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ మెరుపులతో బిగ్ బాష్ లీగ్‌లోని మెల్బోర్న్ స్టార్స్ జట్టు కొత్త సంవత్సరానికి విజయంతో ఆహ్వానం పలికింది. ప్రత్యర్థి జట్టు భారీ టార్గెట్‌ను విధించినా స్టోయినిస్ ఆ టార్గెట్‌ను ‘ఉఫ్’మని ఊదిపారేసాడు. 19 బంతుల్లోనే ఆరు బౌండరీలు, నాలుగు భారీ సిక్సర్లతో చెలరేగి 206 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలుండగానే పూర్తిచేశాడు. దీంతో గ్లెన్ మ్యాక్స్‌వెల్ సారథ్యంలోని మెల్బోర్న్ జట్టు.. న్యూఈయర్కు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పింది.
బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా ఆదివారం మెల్బోర్న్ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 205 పరుగుల భారీ స్కోరుచేసింది. క్రిస్ లిన్ (42 బంతుల్లో 83 నాటౌట్, 10 ఫోర్లు, 4 సిక్సర్లు)తో పాటు కెప్టెన్ మాథ్యూ షార్ట్ (56) రాణించారు.
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన మెల్బోర్న్.. మూడో ఓవర్లోనే ఓపెనర్ థామస్ రోజర్స్ (8) వికెట్ కోల్పోయింది. కానీ మరో ఓపెనర్ డానియల్ లారెన్స్ (26 బంతుల్లో 50, 6 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి బ్యూ వెబ్‌స్టర్ (48 బంతుల్లో 68 నాటౌట్, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడారు. కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా 17 బంతుల్లో 5 బౌండరీల సాయంతో 28 పరుగులు చేశాడు. 14వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన స్టోయినిస్ దొరికిన బంతిని దొరికినట్టు బాదడంతో మెల్బోర్న్ స్టార్స్.. మరో ఆరు బంతులు మిగిలుండగానే భారీ స్కోరును కరిగించి విజయాన్ని అందుకుంది. మాథ్యూ షార్ట్ వేసిన 16వ ఓవర్లో 4, 6, 4 బాదిన స్టోయినిస్.. బెజ్లీ వేసిన 19వ ఓవర్లో 6, 4, 6, 6తో ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. ఆ ఓవర్ ఆఖరి బంతికి సిక్సర్ బాదడంతో 19 బంతుల్లోనే అతడి అర్థసెంచరీతో పాటు మ్యాచ్ కూడా ముగిసింది.
Marcus Stoinis smashed 55 of 19 against Striker.
And chased down 205 easily. You can’t miss this hitting #AUSvPAK #BBL13 #Hotstar #Kohli #ViratKohli𓃵 #Maxwell #Askvenky #Sachin #CricketTwitterpic.twitter.com/grehCmlud1
— Sujeet Suman (@sujeetsuman1991) December 31, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

