Sitanshu Kotak : జూనియర్ స్థాయిలో తానేంటో నిరూపించుకున్న వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) అంతర్జాతీయ అరంగేట్రంపై ఉత్కంఠ కొనసాగుతోంది. 15 ఏళ్లకే రికార్డుల హోరుతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ కుర్రాడు.. ఐర్లాండ్ పర్యటనలో ఆడడంపై స్పష్టత రావడం లేదు. స్క్వాడ్‌లో ఉన్నప్పటికీ తుది జట్టులో వైభవ్ ఉంటాడా? లేదా? అనేది ఎవరూ ధ్రువీకరించకపోవడమే అందుకు కారణం. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు తొలి టీ20 ఉన్నందున.. నెట్స్‌లో ఈ చిచ్చరపిడుగు భారీ షాట్లు ఆడాడు. అయినా సరే బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటాక్ (Sitanshu Kotak) మాత్రం వైభవ్ బెంచ్‌మీదే ఉండే అవకాశముందని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
గత సీజన్ ఐపీఎల్ నుంచి పొట్టి క్రికెట్లో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్ పర్యటనకు ఎంపికవ్వడంతో అరంగేట్రానికి వేళైందని మురిసిపోయారంతా. ఓపెనర్‌గా ఆడిస్తే అంతర్జాతీయ క్రికెట్లోనూ రికార్డులు బద్ధలు కొట్టేస్తాడని అందరూ అనుకుంటున్న వేళ.. వైభవ్ కాస్త ఆగాల్సిందేననే మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే టీ20ల్లో ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ అదరగొడుతున్నారు. ఇషాన్ కిషన్ సైతం పొట్టి వరల్డ్‌కప్‌లో దంచేశాడు. వైభవ్ తుది జట్టులో ఉండాలంటే.. ఈ ముగ్గురిలో ఒకరు బెంచ్ మీదే ఉండాలి. కాబట్టి.. వైభవ్‌ను ఆడించడం కోసం ఎవరో ఒకరిని తప్పించడం సరికాదని భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటాక్ అంటున్నాడు.
🚨 Batting Coach Sitanshu Kotak about Vaibhav Sooryavanshi 🗣️
“Vaibhav Suryavanshi will get his opportunity, but I don’t think just to give him the opportunity we should drop someone who has been scoring runs, that will be unfair to them” pic.twitter.com/oD2HTqIEpq
— Ajay Jadeja (@AjayJadeja171) June 26, 2026
‘వైభవ్‌కు దేశం తరఫున ఆడే అవకాశం కచ్చితంగా లభిస్తుంది. అలాఅనీ, అతడిని ఆడించడం కోసం పరుగులు సాధిస్తున్న ఆటగాడిని పక్కన పెట్టేయాలని నేను అనుకోను. అయితే.. ఈ విషయం జట్టు మేనేజ్మెంట్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. వైభవ్ ప్రతిభావంతుడే. నా దృష్టిలో ఒకరికి అవకాశం ఇవ్వడం కోసం మరొకరికి అన్యాయం చేయడం సరికాదు. ఎందుకంటే.. పరిణతితో ఉండడం, నిర్ణయాలు తీసుకోవడం, జట్టును గెలిపించాలనే తపన.. వంటివి ఉండడం చాలా ముఖ్యం.
“Nothing is bothering him” 😎
India batting coach Sitanshu Kotak has said Vaibhav Sooryavanshi can make his mark if selected for Friday’s T20 against Ireland.
The 15-year-old could break the world record as the youngest international, held by Sachin Tenulkar.#BBCCricket pic.twitter.com/tNOvYZMNMN
— BBC SPORT NI (@BBCSPORTNI) June 25, 2026
అందుకని వైభవ్‌ను జట్టులో ఒకడిగానే చూస్తున్నాం. ఐపీఎల్లో, అండర్-19 క్రికెట్లో మెలిగినట్టే భారత జట్టులోనూ వ్యవహరించాలని వైభవ్‌కు చెప్పాం. కోచ్ గౌతం గంభీర్ సైతం అతడికి ఇదే మాట చెప్పాడు’ అని సితాన్షు మీడియా సమావేశంలో వెల్లడించాడు. భారత్, ఐర్లాండ్ మధ్య సాయంత్రం 6 గంటలకు తొలి టీ20 మొదలవ్వనుంది.