బ్రిస్బేన్: ఐర్లాండ్ ఫీల్డర్ బారీ మెక్కార్తి అద్భుతమైన ఫీల్డింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అతను బౌండరీ లైన్ వద్ద గాలిలో బంతిని పట్టి సిక్సర్ వెళ్లకుండా అడ్డుకున్నాడు. 15వ ఓవర్లో స్టోయినిస్ లాంగ్ ఆన్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. అయితే ఆ బంతి దాదాపు బౌండరీ లైన్ దాటబోయింది. ఆ సమయంలో వెనక్కి ఎగిరి ఎడమ చేతితో బంతిని పట్టాడు మెక్కార్తి. కానీ బౌండరీ లైన్ బయట పడిపోవడాన్ని గమనించి అతను.. తన చేతిలో ఉన్న బంతిని గ్రౌండ్లోకి విసిరేశాడు. దీంతో మెక్కార్తి ఒకరకంగా సిక్సర్‌ను ఆపేశాడు. కానీ ఆ సమయంలో అతను చేసిన ఫీల్డింగ్ అసాధారణం. ఆ ఫీల్డింగ్ స్టంట్‌కు చెందిన వీడియోను ఈ ట్విట్టర్ లింక్‌ను క్లిక్ చేసి చూడండి.
The best save you will ever see near the boundary rope? 😲
Watch the outrageous fielding effort from Barry McCarthy 📹
T20WorldCup | #AUSvIREhttps://t.co/yPy6jkEwTR
— ICC (@ICC) October 31, 2022