BANvsNZ: రాణించిన కివీస్ స్పిన్నర్లు.. రెండో టెస్టులో బంగ్లా బ్యాటర్ల తడబాటు
BANvsNZ: ఢాకాలోని షేర్ ఎ బంగ్లా స్టేడియం వేదికగా జరగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. 66.2 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌట్ అయింది.
BANvsNZ: స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ బ్యాటర్లు తడబడ్డారు. ఢాకాలోని షేర్ ఎ బంగ్లా స్టేడియం వేదికగా జరగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. 66.2 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌట్ అయింది. కివీస్ స్పిన్నర్లు గ్లెన్ ఫిలిప్స్ (3/31), మిచెల్ శాంట్నర్ (3/65)లు రాణించడంతో బంగ్లా తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఆ జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫీకర్ రహీమ్ 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఢాకా వేదికగా జరుగతున్న రెండో టెస్టులో బంగ్లాకు ఆది నుంచే ఎదురుదెబ్బలు తాకాయి. ఓపెనర్ మహ్ముదుల్ హసన్ జాయ్ (14), జకీర్ హసన్ (8)తో పాటు తొలి టెస్టులో సెంచరీ చేసిన కెప్టెన్ నజ్ముల్ శాంతో (9), మోమినుల్ హక్ (5)లు విఫలమయ్యారు. 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన బంగ్లాను ముష్ఫీకర్ రహీం ఆదుకున్నాడు. అతడు షాదాత్ హోసెన్ (31)తో కలిసి ఐదో వికెట్‌కు 57 పరుగులు జోడించాడు. కానీ అబ్‌స్ట్రాకింగ్ ది ఫీల్డ్ (బంతిని చేతితో పట్టుకోవడం)తో రహీమ్ ఔటయ్యాడు.
రహీమ్ నిష్క్రమణ తర్వాత బంగ్లా పతనం వేగంగా సాగింది. మెహిది హసన్ మిరాజ్ (20), నురుల్ హసన్ (7) లతో పాటు నయీమ్ హసన్ (13) లు విఫలమయ్యారు. కివీస్ సారథి టిమ్ సౌథీ 5.2 ఓవర్లు వేసి ఏకంగా ఐదు మెయిడిన్లు చేయడం గమనార్హం. అతడు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఒక వికెట్ పడగొట్టడం విశేషం. ఫిలిప్స్, శాంట్నర్‌లతో పాటు అజాజ్ పటేల్ కూడా రెండు వికెట్లు పడగొట్టడంతో బంగ్లా తక్కువ స్కోరుకే ఆలౌట్ అయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

