బ్యాటింగ్, బౌలింగ్ లో సమిష్టిగా రాణించిన బంగ్లాదేశ్.. గువాహటి వేదికగా జరిగిన మరో వార్మప్ మ్యాచ్ లో శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలుత లంక 49.1 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 42 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది.