Rubel Hossain | అంతర్జాతీయ క్రికెట్‌కు సీనియర్ పేసర్ వీడ్కోలు.. కారణమిదే..!
Rubel Hossain : బంగ్లాదేశ్ క్రికెటర్ రూబెల్ హొస్సేన్(Rubel Hossain) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. కొన్ని రోజులుగా గాయాలతో సతమవుతున్న రూబెల్ మూడు ఫార్మాట్ల నుంచి వైదొలుతున్నట్టు ప్రకటించాడు.
Rubel Hossain : బంగ్లాదేశ్ క్రికెటర్ రూబెల్ హొస్సేన్ (Rubel Hossain) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. కొన్ని రోజులుగా గాయాలతో సతమవుతున్న రూబెల్ మూడు ఫార్మాట్ల నుంచి వైదొలుతున్నట్టు ప్రకటించాడు. ఐదేళ్ల క్రితం చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన ఈ పేసర్ తన రిటైర్మెంట్ వార్తను ఫేస్బుక్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. వన్డేల్లో అరంగేట్రంలోనే నాలుగు వికెట్లు తీసిన బంగ్లా బౌలర్‌గా చరిత్రకెక్కిన రూబెల్ ఇకపై దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారించనున్నాడు.
పసికూనగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన బంగ్లాదేశ్ సంచలన విజయాలతో నేడు పటిష్టమైన టీమ్‌గా ఎదిగింది. ఈ క్రమంలో రూబెల్ లాంటి పేసర్లు బంగ్లా క్రికెట్‌కు వెన్నుదన్నులా నిలిచారు. 2009లో తొలి వన్డే ఆడిన ఈ పేసర్ నాలుగు వికెట్లతో రికార్డు నెలకొల్పాడు. వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై నాలుగు వికెట్లతో వార్తల్లో నిలిచిన రూబెల్ సుదీర్ఘ కెరీర్‌ను ముగించాడు. ఓవైపు గాయాలు వేధిస్తుండడం.. జాతీయ జట్టులో కుర్రాళ్లు పాతుకుపోవడం కారణంగా వీడ్కోలుకు సరైన సమయమని భావించాడీ స్పీడ్‌స్టర్.
Rubel Hossain retires with 193 wickets for Bangladesh – he played the last of his 159 international matches in April 2021 🇧🇩
Full story: https://t.co/x8axdJXCJg pic.twitter.com/mAPrbM3ukr
— ESPNcricinfo (@ESPNcricinfo) April 16, 2026
‘నేను పేస్ బౌలర్ రూబెల్ హొస్సేన్. బంగ్లాదేశ్ తరఫున 27 టెస్టులు, 104 వన్డేలు, 28 టీ20లు ఆడాను. జాతీయ జట్టుకు ఆడడమంటే చాలా ఇష్టం. కానీ, ఏదో ఒక దశలో అంతర్జాతీయ క్రికెట్‌ను వదిలేయాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే నేను రిటైరవుతున్నా. అయితే.. దేశవాళీ క్రికెట్లో మాత్రం కొనసాగుతాను. ఈ సందర్భంగా నా కుటుంబానికి, స్నేహితులకు, మీడియాకు, అభిమానులకు ధన్యవాదాలు తెలయజేస్తున్నా.
#OnThisDay in 2015, an embarrassing exit from the World Cup for England
After Mahmudullah’s century and Mushfiqur Rahim’s 89 took Bangladesh to 275, Rubel Hossain took 4 for 53 to knock England out
— ESPNcricinfo (@ESPNcricinfo) March 9, 2022
వీరంతా నన్ను ఇకపై కూడా మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నా’ అని రూబెల్ తన వీడ్కోలు సందేశంలో పేర్కొన్నాడు. ఫార్మాట్లలో కీలక బౌలర్‌గా రాణించిన రూబెల్ వన్డేల్లో అదుర్స్ అనిపించాడు. 34.31 సగటుతో 129 వికెట్లు కూల్చిన వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో బంగ్లా బౌలర్‌గా మరో రికార్డు తన పేరిట రాసుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

