మా బౌలర్లందరికీ తెలుసు

- బాల్ ట్యాంపరింగ్ ఉదంతంపై బాన్‌క్రాఫ్ట్
లండన్: బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి నిషేధాన్ని ఎదుర్కొన్న ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ ఆ ఉదంతంపై సంచలన విషయాలు చెప్పాడు. ఆ రోజు తాను ట్యాంపరింగ్ చేస్తున్నట్టు తన జట్టులోని బౌలర్లు అందరికీ తెలునని వెల్లడించాడు. కేప్‌టౌన్ వేదికగా 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో సాండ్‌పేపర్‌తో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలలు, అందుకు ప్రోత్సహించిన డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌పై ఏడాది నిషేధం వేటుపడిన సంగతి తెలిసిందే. సాండ్‌పేపర్ గేట్గా ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో మాయనిమచ్చగా నిలిచిన ఈ ఘటనపై శనివారం ఓ ఇంటర్వ్యూలో కామెరూన్ మాట్లాడాడు. ‘నేను చేసిన తప్పునకు నేనే బాధ్యత వహించాలనుకుంటున్నా. ఇది బౌలర్లకు ఉపయోగకరంగా మారుతుందని ఆ రోజు అందరికీ తెలుసు. జట్టులో ఉన్న వారందరికీ టాంపరింగ్ విషయం తెలుసు. ఆ సమయంలో విలువలపై నియంత్రణ కోల్పోయా. ఆ తప్పు చేసే వరకు కూడా ఏం చేస్తున్నానో కూడా అర్థం చేసుకోలేకపోయా. కానీ దీనివల్ల ఓ కఠిన పాఠాన్ని నేర్చుకున్నా’ అని బాన్‌క్రాఫ్ట్ చెప్పాడు
సీఏ పునర్విచారణ!
బాల్ ట్యాంపరింగ్‌పై బాన్‌క్రాఫ్ట్ విస్తుగొపిలే విషయాలను వెల్లడించడంతో ఈ ఉదంతంపై పునర్విచారణ చేయాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నిర్ణయించింది. ఆ రోజు ట్యాంపరింగ్ గురించి జట్టులో ముందే ఎవరెవరికి తెలుసో గుర్తించేందుకు సాండ్‌పేపర్ గేట్‌పై మళ్లీ విచారణ చేయనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

