Bajrang Punia | పరువునష్టం కేసులో రెజ్లర్ బజరంగ్ పునియాకు ఊరట..!
Bajrang Punia | పరువునష్టం కేసులో రెజ్లర్ బజరంగ్ పునియాకు ఢిల్లీలోని పాటియాలా హౌస్‌కోర్టు ఊరటనిచ్చింది. కిర్గిస్థాన్‌లో జరిగే ఆసియా క్రీడల కోసం సిద్ధమవుతున్నాడని.. అతని తరఫున న్యాయవాది కోర్టుకు తెలుపగా.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఇచ్చారు.
Bajrang Punia | పరువునష్టం కేసులో రెజ్లర్ బజరంగ్ పునియాకు ఢిల్లీలోని పాటియాలా హౌస్‌కోర్టు ఊరటనిచ్చింది. కిర్గిస్థాన్‌లో జరిగే ఆసియా క్రీడల కోసం సిద్ధమవుతున్నాడని.. అతని తరఫున న్యాయవాది కోర్టుకు తెలుపగా.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఇచ్చారు. కేసు విచారణ వాయిదాపడగా.. అక్టోబర్ 17న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ఆగస్టు 3న పాటియాలా హౌస్ రెజ్లింగ్ కోచ్ నరేశ్ దహియా ఒలింపిక్ పతక విజేత రెజర్ల్ పునియాపూ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశాడు.
దీనిపై విచారణ జరిపిన కోర్టు.. సమన్లు జారీ చేసింది. పిటిషన్‌పై గురువారం విచారణ సందర్భంగా ఈ సందర్భంగా పునియా త్వరలో ఆసియా క్రీడలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కిర్గిస్థాన్‌కు వెళ్లనున్నాడని, అక్టోబర్ 4 నుంచి 7 వరకు జరిగే రెజ్లింగ్ పోటీల్లో పాల్గొంటాడని అతని తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు విచారణను అక్టోబర్ 17వ తేదీకి వాయిదా వేసింది. ఈ ఏడాది మే 10న జంతర్ మంతర్ వద్ద నిరసన సందర్భంగా పునియా విలేకరుల సమావేశంలో తనపై అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తూ నరేశ్ దహియా పరువునష్టం కేసు దాఖలు చేశారు.
లైంగిక వేధింపుల ఆరోపణలపై టాప్ రెజ్లర్లు 30 మంది జనవరిలో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌తో పాటు పలువురు కోచ్‌లపై రెజర్లు తీవ్ర ఆరోపణలు చేశారు. బ్రిస్ భూషణ్‌తో పాటు కోచ్ లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సమ్మెకు దిగగా.. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వారితో చర్చలు జరిపిన అనంతరం రెజర్లు ఆందోళన విరమించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

