Babar Azam | పాకిస్థాన్‌కు పెద్ద దిక్కు బాబరే.. నాలుగు నెలల్లోనే కెప్టెన్సీ
Babar Azam : పాకిస్థాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజాం(Babar Azam) మళ్లీ సారథిగా ఎంపికయ్యాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL 2024)లో దంచికొట్టిన అతడు త్వరలోనే వన్డే, టీ 20 సారథిగా పగ్గాలు చేపట్టనున్నాడు. టీ20 వరల్డ్ కప్ సమీపిస్తున్నందున...
Babar Azam : పాకిస్థాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజాం(Babar Azam) మళ్లీ సారథిగా ఎంపికయ్యాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL 2024)లో దంచికొట్టిన అతడు త్వరలోనే వన్డే, టీ 20 సారథిగా పగ్గాలు చేపట్టనున్నాడు. టీ20 వరల్డ్ కప్ సమీపిస్తున్నందున జట్టును గాడిలో పెట్టగల సమర్ధుడు బాబరే అని పాక్ క్రికెట్ బోర్డు, సెలెక్షన్ కమిటీ తీర్మానించాయి.
ఊహించినట్టుగానే బాబర్ మళ్లీ సారథిగా ఎంపికవ్వడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్‌గా మళ్లీ ఎంపికైన బాబర్ ఆదివారం పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీని మర్యాద పూర్వకంగా కలిశాడు. పీసీబీ ఎక్స్ ఖాతాలో పెట్టిన ఆ వీడియో వైరల్ అవుతోంది.
Babar Azam appointed as white-ball captain
Following unanimous recommendation from the PCB’s selection committee, Chairman PCB Mohsin Naqvi has appointed Babar Azam as white-ball (ODI and T20I) captain of the Pakistan men’s cricket team. pic.twitter.com/ad4KLJYRMK
— Pakistan Cricket (@TheRealPCB) March 31, 2024
వరల్డ్ కప్ ఓటమికి..
వన్డే వరల్డ్ కప్‌లో జట్టు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ బాబర్ కెప్టెన్‌గా వైదొలిగాడు. దాంతో షాన్ మసూద్, షాహీన్ ఆఫ్రిదీలను పీసీబీ కొత్త కెప్టెన్లుగా నియమించింది. అయితే.. వీళ్లిద్దరూ జట్టును గెలుపు బాట పట్టించలేకపోయారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలో పాక్ దారుణంగా ఓడింది.
.@babarazam258 to lead Pakistan men’s team in white-ball cricket ©️🇵🇰 pic.twitter.com/PNZXIFH9yh
— Pakistan Cricket (@TheRealPCB) March 31, 2024
దాంతో, త్వరలో వెస్టిండీస్, అమెరికాలో జరిగే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో జట్టును నడిపించే సమర్ధుడైన నాయకుడి కోసం పీసీబీ అన్వేషించింది. ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్‌గా ఎన్నో విజయాలు అందించిన బాబర్‌కే మళ్లీ పగ్గాలు అప్పగించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భావించింది. దాంతో, నాలుగు నెలల్లోనే బాబర్ వైట్ బాల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
ఇవి కూడా చదవండి
- Market Capitalisation | రూ.20 లక్షల కోట్ల మార్క్ దాటిన రిలయన్స్.. టాప్10లో ఏడు సంస్థల ఎం-క్యాప్ గెయిన్ ఇలా..!
- Kadiyam Srihari | మాదిగలను మోసం చేస్తున్న కడియం శ్రీహరి.. వంగపల్లి శ్రీనివాస్ ఫైర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

