Ayush Shetty | క్వార్టర్ ఫైనల్లో ఆయుశ్.. తొలి రౌండ్లోనే సింధు, ప్రణయ్ ఇంటికి..!
Ayush Shetty : భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి (Ayush Shetty) అదుర్స్ అనిపించాడు. ప్రతిష్ఠాత్మక బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు
Ayush Shetty : భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి (Ayush Shetty) అదుర్స్ అనిపించాడు. ప్రతిష్ఠాత్మక బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్షిప్స్ (Badminton Asian Championships)లో సీనియర్లు తేలిపోగా.. ఈ కుర్రాడు మాత్రం క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. గురువారం చీ యు జెన్(చైనీస్ తైపీ)ను చిత్తు చేసిన ఆయుశ్ టైటిల్‌పై ఆశలు రేపుతూ క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌హెచ్ ప్రణయ్ చేతెలెత్తేయగా.. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు సైతం మొదటి రౌండ్లో ఓటమితో ఇంటిదారి పట్టింది.
చైనా వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో గురువారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పీవీ సింధు తొలి రౌండ్లో, హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్స్‌కు ముందే నిష్క్రమించారు.
Badminton Asia Championships: Ayush Shetty Continues Winning Run, Enters Quarterfinals https://t.co/3xOjHQFZhW
— RevSportz Global (@RevSportzGlobal) April 9, 2026
ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్ ఆడలేకపోయిన సింధు ఈ టోర్నీలో మెరుస్తుందనుకుంటే.. వరల్డ్ నంబర్ 2 ధాటికి మొదటి రౌండ్లోనే పరాజయం పాలైంది. రెండు సెట్లలో పోరాడిన తెలుగు తేజాన్ని వాంగ్ జీ యీ 21-18, 21-18తో మట్టికరిపించింది. తొలి రౌండ్లో అదరగొట్టిన ప్రణయ్‌ను చైనా షట్లర్ వెంగ్ హాంగ్ యాంగ్ 21-12, 21-19తో సులువుగా ఓడించాడు.
ఆయుశ్ తగ్గేదేలే..
సీనియర్లు విఫలమైన చోట ఇరవై ఏళ్ల ఆయుశ్ ప్రత్యర్ధికి దడ పుట్టించాడు. తొలి రౌండ్లోనే ఏడో ర్యాంకర్ చైనా ఆటగాడిని ఇంటికి పంపిన ఆయుశ్ ఈసారి 25వ ర్యాంకరైన చీ యూ జెన్(చైనీస్ తైపీ)ను వణికించాడు. మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిపత్యం చెలాయించిన భారత కుర్రాడు.. 21-16, 21-12తో గెలుపొందాడు. క్వార్టర్స్‌లో అతడికి మూడో సీడ్ జోనాథన్ క్రిస్టీ(ఇండోనేషియా) ఎదురుపడనున్నాడు. ఆయుష్ సెమీస్ చేరాలంటే జోనాథన్ వ్యూహాలను చిత్తు చేయాల్సిందే.
🚨 UPSET ALERT 🚨
Ayush Shetty Upsets WR 7 Li Shi Feng In Straight Games 💥
21-13 , 21-16Superb Win By Ayush ❤️
R16 vs Chi Yu Jen 🇹🇼#BAC2026 pic.twitter.com/NjRolruoC8— Badminton Media (@BadmintonMedia1) April 8, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

