AUSvsPAK 1st Test: 500 వికెట్ల క్లబ్లో చేరిన ఆసీస్ స్పిన్నర్.. షేన్‌వార్న్ తర్వాత అతడే..
AUSvsPAK 1st Test: 36 ఏండ్ల ఈ ఆఫ్ స్పిన్నర్.. రెండో ఇన్నింగ్స్‌లో పాక్ ఆటగాడు ఫహీమ్ అష్రఫ్ వికెట్ తీయడంతో అతడి వికెట్ల ఖాతా 500కు చేరింది.
AUSvsPAK 1st Test: ఆస్ట్రేలియా – పాకిస్తాన్ మధ్య ఆదివారం ముగిసిన తొలి టెస్టులో ఆసీస్ సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు (రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి) తీసిన లియాన్.. టెస్టు క్రికెట్లో 500 వికెట్ల క్లబ్లో చేరాడు. 36 ఏండ్ల ఈ ఆఫ్ స్పిన్నర్.. రెండో ఇన్నింగ్స్‌లో పాక్ ఆటగాడు ఫహీమ్ అష్రఫ్ వికెట్ తీయడంతో అతడి వికెట్ల ఖాతా 500కు చేరింది. తద్వారా లియాన్ ఆస్ట్రేలియా తరఫున టెస్టులలో 500 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా, రెండో స్పిన్నర్‌గా నిలిచాడు.
ఇప్పటికే ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వికెట్లు సాధించినవారిలో మూడో స్థానం (టెస్టులలో) లో ఉన్న లియాన్.. తాజాగా 500 వికెట్ల క్లబ్‌లోనూ చేరాడు. లియాన్ కంటే ముందు కంగారూల తరఫున దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్, గ్లెన్ మెక్‌గ్రాత్‌లు ఈ ఘనత సాధించారు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో 500, అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించినవారిలో లియాన్ 8 వ స్థానంలో ఉన్నాడు. 2011లో శ్రీలంకతో గాలె వేదికగా జరిగిన టెస్టులో అరంగేట్రం చేసిన లియాన్.. ఈ ఫార్మాట్లో ఆసీస్‌కు ప్రధాన స్పిన్నర్ అయ్యాడు. టెస్టులలో 23 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన లియాన్.. నాలుగు సార్లు 10 వికెట్లు (ఒక టెస్టులో) తీసిన రికార్డు అందుకున్నాడు. టెస్టులలో అతడి అత్యుత్తమ ప్రదర్శన 8/50గా ఉంది.
ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వికెట్ల వీరులు (టెస్టులలో)..
– షేన్ వార్న్ (133 టెస్టులలో 708 వికెట్లు)
– గ్లెన్ మెక్‌గ్రాత్ (124 టెస్టులలో 563)
– నాథన్ లియాన్ (123 టెస్టులలో 501)
– డెన్నిస్ లిల్లీ (70 టెస్టులలో 355)
టెస్టులలో టాప్ – 10 వికెట్ టేకర్స్:
ముత్తయ్య మురళీధరన్ (800)
షేన్ వార్న్ (708)
జేమ్స్ అండర్సన్ (690)
అనిల్ కుంబ్లే (619)
స్టువర్ట్ బ్రాడ్ (604)
గ్లెన్ మెక్‌గ్రాత్ (563)
కోట్నీ వాల్ష్ (519)
నాథన్ లియాన్ (501)
రవిచంద్రన్ అశ్విన్ (489)
డేల్ స్టెయిన్ (439)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

