స్మిత్ సూపర్
స్టీవెన్ స్మిత్..సెంచరీల జోరు టాప్‌గేర్‌లో దూసుకెళుతున్నది. సుదీర్ఘ ఫార్మాట్లో తనకు తిరుగులేదన్న రీతిలో స్మిత్ శతక పరంపర కొనసాగిస్తున్నాడు. లార్డ్స్‌లో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఇంగ్లండ్‌కు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు.
- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 416 ఆలౌట్
- అద్భుత సెంచరీతో విజృంభణ.. దీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్
టెస్టుల్లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ సెంచరీల హవా కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని నైజంతో స్మిత్ వరుస సెంచరీలతో అదరగొడుతున్నాడు ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ క్రికెట్ మక్కా లార్డ్స్‌లో పరుగుల వరద పారించాడు. కళాత్మక షాట్లతో అభిమానులను కట్టిపడేస్తూ టెస్టు కెరీర్లో 32వ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో రికార్డులను తిరుగరాసిన ఈ నయా బ్రాడ్‌మన్ ఆసీస్‌కు భారీ స్కోరు కట్టబెట్టాడు. ‘బజ్‌బాల్’ను నమ్ముకున్న ఇంగ్లండ్ కూడా తామేం తక్కువ కాదన్నట్లు కంగారూలకు దీటుగా బదులిస్తున్నది. మూడు రోజులు మిగిలి ఉన్న మ్యాచ్‌లో గెలుపు ఎవరిదన్నది ఆసక్తికరంగా మారింది.
లండన్: స్టీవెన్ స్మిత్..సెంచరీల జోరు టాప్‌గేర్‌లో దూసుకెళుతున్నది. సుదీర్ఘ ఫార్మాట్లో తనకు తిరుగులేదన్న రీతిలో స్మిత్ శతక పరంపర కొనసాగిస్తున్నాడు. లార్డ్స్‌లో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఇంగ్లండ్‌కు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇప్పటికే ఒకటి కోల్పోయి ఒత్తిడిలో ఉన్న ఇంగ్లండ్‌పై స్మిత్ ముప్పేట దాడికి పాల్పడ్డాడు. ఓవర్‌నైట్ స్కోరు 339/5 రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 416 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్లు స్మిత్(184 బంతుల్లో 110, 15ఫోర్లు) సూపర్ సెంచరీతో కదంతొక్కగా, అలెక్స్ క్యారీ(22) నిరాశపరిచాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్(22 నాటౌట్)గా నిలువగా, రాబిన్సన్(3/100), జోష్ టాంగ్(3/98) మూడేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. బెన్ డకెట్(98) తృటిలో సెంచరీ చేజార్చుకోగా, హ్యారీ బ్రూక్(45), కెప్టెన్ బెన్ స్టోక్స్(17) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. స్టార్క్, హాజిల్‌వుడ్, లియాన్, గ్రీన్ ఒక్కో వికెట్ తీశారు. చేతిలో ఆరు వికెట్లు ఉన్న ఇంగ్లండ్..138 పరుగుల వెనుకంజలో కొనసాగుతున్నది.
తిరుగులేని స్మిత్: ఆసీస్ స్టార్ స్మిత్‌కు తిరుగులేకుండా పోయింది. టెస్టుల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న స్మిత్ కొద్ది రోజుల వ్యవధిలోనే మరో సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. క్రీజులో కుదురుకుంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే అన్న రీతిలో విరుచుకుపడుతున్నాడు. సహచర బ్యాటర్లు విఫలమైన చోట తాను ఉన్నానంటూ మూలస్తంభంలా నిలుస్తున్నాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో స్మిత్ వారెవ్వా అనిపించాడు. ఓ వైపు సహచరులు నిష్క్రమిస్తుంటే తాను మాత్రం క్రీజులో పాతుకుపోతూ పరుగులు కొల్లగొట్టాడు. వైవిధ్యమైన షాట్లతో అభిమానులను అలరిస్తూ స్కోరుబోర్డుకు కీలక పరుగులు జతచేశాడు. ఈ క్రమంలో తన టెస్టు కెరీర్లో 32వ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. దాదాపు ఐదు గంటల పాటు క్రీజులో ఉన్న స్మిత్ ఏకాగ్రత కోల్పోకుండా చూడచక్కని షాట్లతో సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. ఓవైపు ఇంగ్లండ్ బౌలర్లు నిప్పులు చెరుగుతున్నా..వెన్నుచూపని ధీరత్వంతో ముందుకు సాగాడు.
2 టెస్టుల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక సెంచరీలు (32) చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. రికీ పాంటింగ్ 41 సెంచరీలతో టాప్‌లో ఉన్నాడు.
22 టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్ చేసిన సెంచరీలు. ఇంతకుముందు పాంటింగ్ (21) పేరిట ఉన్న రికార్డును స్మిత్ చెరిపేశాడు.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్(స్మిత్ 110, వార్నర్ 66, రాబిన్సన్ 3/100, టాంగ్ 3/98), ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 278/4(డకెట్ 98, బ్రూక్ 45 నాటౌట్, లియాన్ 1/35, గ్రీన్ 1/43)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

