Australian Open : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వరల్డ్ నంబర్ 5 క్రీడాకారిణి అరీనా సబలెంక విజయపరంపర కొనసాగుతోంది. భారీ విజయంతో ఆమె నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లింది. మూడో రౌండ్లో డబుల్స్‌లో తన మాజీ భాగస్వామి ఎలిసే మెర్టెన్స్(బెల్జియం)ను వరుస సెట్లలో చిత్తు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఈ బెలారస్ ప్లేయర్ 6-2, 6-3తో ఎలిసేను ఓడించింది. తర్వాతి రౌండ్లో ఒలింపిక్స్ ఛాంపియన్ బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్)తో సబలెంక తలపడనుంది. మూడో రౌండ్లో బెన్సిక్, కమిలా గియోర్గి(ఇటలీ)ని 6-2, 7-5తో మట్టికరిపించింది.
సబలెంక ఈమధ్యే అడిలైడ్ ఇంటర్నేషనల్ 1 టైటిల్ గెలుపొందింది. ఈ వరల్డ్ నంబర్ 1 ప్లేయర్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ అదే ఫామ్ కొనసాగిస్తోంది. ఈమె ఖాతాలో రెండు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిళ్లు ఉన్నాయి. 2021లో ఎలిసే మెర్టెన్స్తో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ గెలిచింది. 209లో యూఎస్ ఓపెన్ డబుల్స్ ట్రోఫీ నెగ్గింది.