కాన్బెర్రా: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. వెస్టిండీస్‌పై వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట విండీస్ 24.1 ఓవర్లలో 86 పరుగులకు ఆలౌటైంది.
అలిక్ అథన్జే (32) టాప్ స్కోరర్ కాగా.. కంగారూ బౌలర్లలో జేవియర్ 4 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఆసీస్ 6.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. జాక్ ఫ్రజెర్ (41; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇంగ్లిస్ (35 నాటౌట్; 4 ఫోర్లు ఒక సిక్సర్) దంచికొట్టారు. జేవియర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.