వచ్చే వారమే మాకు వ్యాక్సిన్లు.. ఐపీఎల్‌లోని ఆస్ట్రేలియా ప్లేయర్ సంచలన ప్రకటన

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా ప్లేయర్ క్రిస్ లిన్ సంచలన ప్రకటన చేశాడు. వచ్చే వారమే లీగ్‌లోని ప్లేయర్స్ అందరికీ వ్యాక్సిన్లు ఇవ్వనున్నట్లు అతడు చెప్పడం గమనార్హం. మంగళవారం ఓ ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లిన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఐపీఎల్లో ఆడుతున్న క్రికెటర్లందరికీ వ్యాక్సిన్లు ఇవ్వనున్నట్లు లిన్ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇందులోని విదేశీ ప్లేయర్స్‌కు కూడా బీసీసీఐ వ్యాక్సిన్లు ఇస్తుందా అన్న సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. మే 1 నుంచి దేశంలోని 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్లు ఇవ్వాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికోసం బుధవారం నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రిజిస్టర్ చేసుకుంటేనే వ్యాక్సిన్ ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు కొవిడ్ కేసుల భయంతో ఇప్పటికే ముగ్గురు ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఇంటికి వెళ్లిపోయిన నేపథ్యంలో క్రిస్ లిన్ చేసిన ఈ ప్రకటన సంచలనం రేపుతోంది.
మాకు తెలుసు మా కంటే కూడా చాలా మంది పరిస్థితి దారుణంగా ఉంది. కానీ మేము చాలా కఠినమైన బబుల్‌లో ఉన్నాము. వచ్చే వారమే వ్యాక్సిన్లు కూడా వేసుకోబోతున్నాము. ఆస్ట్రేలియా ప్రభుత్వం మమ్మల్ని ఓ ప్రైవేట్ చార్టర్లో తిరిగి రావడానికి అనుమతి ఇస్తుందని ఆశిస్తున్నాము అని లిన్ అన్నాడు.
ప్రతి ఐపీఎల్ కాంట్రాక్ట్‌పై క్రికెట్ ఆస్ట్రేలియాకు పది శాతం వస్తుంది. ఆ డబ్బుతో టోర్నీ ముగిసిన తర్వాత మేము చార్టర్ విమానంలో తిరిగి రావచ్చా అని నేను అడిగాను. మేమేమీ షార్ట్కట్ల గురించి అడగడం లేదు. ఈ రిస్క్‌లన్నీ తెలిసే సంతకాల చేశాము. కానీ టోర్నీ ముగియగానే సాధ్యమైనంత త్వరగా ఇంటికి వెళ్లిపోతే బాగుంటుంది అని లిన్ అన్నాడు.
ఇప్పటికే ఇండియా నుంచి వచ్చే విమానాలపై మే 15వ తేదీ వరకూ ఆస్ట్రేలియా నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ ముప్పును ముందే ఊహించిన ముగ్గురు ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఇప్పటికే వెళ్లిపోగా.. వార్నర్, స్మిత్ లాంటి వాళ్లు కూడా వెళ్లిపోతారన్న వార్తలు వచ్చాయి. అంతలోపే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

