AUS vs PAK: బాక్సింగ్ డే టెస్టుకు వర్షం అంతరాయం.. నిలకడగా ఆడుతున్న ఆసీస్
AUS vs PAK: ఆస్ట్రేలియా - పాకిస్తాన్ మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు లో వర్షం అంతరాయం కలిగించినా ఆసీస్ నిలకడగా ఆడుతోంది. టాస్ సమయానికంటే ముందే కొద్దిసేపు వర్షం కురవడంతో ఆలస్యంగా ఆరంభమైన మ్యాచ్‌లో..
AUS vs PAK: ఆస్ట్రేలియా – పాకిస్తాన్ మధ్య మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు (రెండో టెస్టు)లో వర్షం అంతరాయం కలిగించినా ఆసీస్ నిలకడగా ఆడుతోంది. టాస్ సమయానికంటే ముందే కొద్దిసేపు వర్షం కురవడంతో ఆలస్యంగా ఆరంభమైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్.. మొదట బౌలింగ్ ఎంచుకుంది. 66 ఓవర్లే సాధ్యమైన తొలి రోజు ఆటలో ఆసీస్.. మూడు వికెట్లు కోల్పోయి 187 పరుగులు సాధించింది. ఆసీస్ బ్యాటర్లు నిలకడగా ఆడుతూ భారీ స్కోరు దిశగా సాగుతున్నారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్‌కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (38), ఉస్మాన్ ఖవాజా (42)లు తొలి వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి శుభారంభమిచ్చారు. పార్ట్ టైమ్ స్పిన్నర్ అఘా సల్మాన్ వేసిన 28వ ఓవర్లో వార్నర్.. బాబర్ ఆజమ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటవడంతో ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. వార్నర్ ఔటయ్యాక కొద్దిసేపటికే ఖవాజా కూడా హసన్ అలీ బౌలింగ్‌లో అఘా సల్మాన్‌కు క్యాచ్ ఇచ్చాడు.
75 బంతులాడి రెండు ఫోర్ల సాయంతో 26 పరుగులే చేసిన స్టీవ్ స్మిత్‌ను అమీర్ జమాల్.. 58వ ఓవర్లో ఐదో బంతికి ఔట్ చేశాడు. దీంతో ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. వన్ డౌన్లో వచ్చిన మార్నస్ లబూషేన్.. (120 బంతుల్లో 44 నాటౌట్, 3 ఫోర్లు), ట్రావిస్ హెడ్ ( 9 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది ఏమాత్రం ప్రభావం చూపలేదు. కొత్త బౌలర్ మిర్ హమ్జా.. 15 ఓవర్లు వేసి నాలుగు మెయిడిన్లతో 27 పరుగులే ఇచ్చినా వికెట్ మాత్రం తీయలేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

