AUS vs BAN: మార్ష్ వీరవిహారం.. ఆసీస్ ఘన విజయం..
AUS vs BAN: ఇటీవల అఫ్గానిస్తాన్‌పై గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసాలు మరిచిపోకముందే తాజాగా బంగ్లాదేశ్ తో ఆసీస్ స్టార్ బ్యాటర్ మిచెల్ మార్ష్.. మరోసారి అలాంటి ఇన్నింగ్స్ తోనే అభిమానులను అలరించాడు.
AUS vs BAN: వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా వరుసగా ఏడో విజయాన్ని నమోదుచేసింది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో ముగిసిన మ్యాచ్‌లో ఆసీస్.. 8 వికెట్ల తేడాతో ఘనవిజయం నమోదుచేసింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 307 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్.. 44.4 ఓవర్లలోనే ఛేదించింది.ఇటీవల అఫ్గానిస్తాన్‌పై గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసాలు మరిచిపోకముందే ఈ మ్యాచ్‌లో ఆసీస్ స్టార్ బ్యాటర్ మిచెల్ మార్ష్.. 132 బంతుల్లోనే 17 బౌండరీలు, 9 భారీ సిక్సర్ల సాయంతో 177 పరుగులు చేసి అజేయంగా నిలిచి అభిమానులను అలరించాడు. డేవిడ్ వార్నర్ (61 బంతుల్లో 53, 6 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (64 బంతుల్లో 63 నాటౌట్, 4 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించారు.
భారీ ఛేదనలో ఆసీస్.. మూడో ఓవర్లోనే ఓపెనర్ ట్రావిస్ హెడ్ (10) వికెట్‌ను కోల్పోయింది. బంగ్లాదేశ్‌కు ఇదొక్కటే కాస్త సంతోషించే విషయం. ఆ తర్వాత వార్నర్, మార్ష్ లు రెండో వికెట్‌కు 122 పరుగులు జోడించారు. వార్నర్ నిష్క్రమించినా .. మార్ష్ బంగ్లాదేశ్ బౌలర్లను చితక్కొట్టాడు. 37 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసిన మార్ష్.. 87 బంతుల్లో సెంచరీ పూర్తిచేశాడు. సెంచరీ తర్వాత మార్ష్ వీరవిహారం మరో స్థాయికి వెళ్లింది. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీ లైన్ దాటించిన మార్ష్.. 117 బంతుల్లోనే 150 పరుగుల మార్కు దాటాడు. మరో ఎండ్‌లో స్మిత్ కూడా రెచ్చిపోవడంతో ఆసీస్ స్కోరుబోర్డు రాకెట్ వేగాన్ని తలపించింది. ఈ ఇద్దరూ బాదడంతో ఆసీస్ లక్ష్యాన్ని 44.4 ఓవర్లలోనే ఛేదించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

