SLW vs IREW : మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్ ఆశలు మిణుకుమిణుకుమంటున్న వేళ.. శ్రీలంక అదిరే విజయం సాధించింది. కెప్టెన్ చమరి ఆటపట్టు(106 నాటౌట్) విధ్వంసక ఆటతో ఐర్లాండ్ బౌలర్లపై విరుచుకుపడగా 6 వికెట్లతో లంక గెలుపొందింది. స్వల్ప ఛేదనలో ప్రత్యర్థి బౌలింగ్ దళాన్ని తుత్తునియలు చేసిన ఆటపట్టు ఈ సీజన్లో తొలి సెంచరీ.. మొత్తంగా నాలుగో టీ20 వందతో రెచ్చిపోయింది. దాంతో,16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకున్న లంక రెండు విజయాలతో నాలుగు పాయింట్లతో గ్రూప్ బీ నుంచి నాలుగో స్థానంలో నిలిచింది.
సెమీస్ ఆశలు సంక్లిష్టంగా మారిన వేళ శ్రీలంక సూపర్ విక్టరీ కొట్టింది. కౌంటీ గ్రౌండ్లో మంగళవారం ఐర్లాండ్‌ను వణికించిన లంక భారీ విజయంతో నాకౌట్ రేసులో నిలిచింది. 131 పరుగుల ఛేదనలో నిర్దాక్షిణ్యంగా ఐర్లాండ్ బౌలర్లపై విరుచుకుపడిన చమరి ఆటపట్టు(106 నాటౌట్) ఖతర్నాక్ శతకంతో రెచ్చిపోయింది. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి బాదిన తను 30 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టింది. యాభై తర్వాత తను మరింత చెలరేగి ఆడి జట్టును విజయానికి చేరువ చేసింది.
A 𝙘𝙚𝙣𝙩𝙪𝙧𝙮 𝙤𝙛 𝙨𝙞𝙭𝙚𝙨 for Chamari Athapaththu 👏
The #SL skipper sits down on one knee & absolute crunches it to bring up her 100th six in T20Is 🙌
ICC Women’s #T20WorldCup 2026 | #SLvIRE | LIVE NOW! 👉 https://t.co/vSGsx9oTZ4 pic.twitter.com/lnqmmuhSqT
— Star Sports (@StarSportsIndia) June 23, 2026
లంక స్కోర్ 98 వద్ద ఓపెనర్ ఇమేష దులానీ(20) ఔటయ్యాక కెల్లీ ఓవర్లో ఫోర్, సింగిల్‌తో ఈ ఎడిషన్‌లో తొలి శతకం నమోదు చేసింది ఆటపట్టు. మొత్తంగా ఈ ఫార్మాట్లో ఆమెకిది నాలుగో సెంచరీ. 16వ ఓవర్ మూడో బంతకి బౌండరీతో 9 వికెట్ల విజయంతో గ్రూప్ బీలో సెమీస్ రేసును ఆసక్తికరంగా మర్చేసింది శ్రీలంక. ఇప్పటికే హ్యాట్రిక్ ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించిన ఐర్లాండ్ నాలుగో పరాజయం మూటగట్టుకుంది.
SL W 🇱🇰 : 1️⃣3️⃣4️⃣-1️⃣ (15.3 Overs)
Athapaththu* : 1️⃣0️⃣6️⃣⁶¹
Imesha : 2️⃣0️⃣²⁷Prendergast : 1️⃣-2️⃣2️⃣⁴
SL W 🇱🇰 WON BY 9️⃣ WICKETS #SLvsIRE #SLWvsIREW #T20WorldCup #WomensT20WorldCup #Cricket #SriLanka #Irelandpic.twitter.com/Hq4J3ejgsm https://t.co/CtfeR76I9e
— Cricket Lover 🏏 (@Crick97924Lover) June 23, 2026