Asian Games 2023 | షూటింగ్లో భారత్‌కు రెండో పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రమితకు కాంస్యం
Asian Games 2023 | ఆసియా గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. ఇప్పుడు షూటర్ రమితా జిందాల్ (19) మరో పతకాన్ని భారత్ ఖాతాలో వేసింది. మహిళ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
హాంగ్జౌ: ఆసియా గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల షూటింగ్ విభాగంలో రెండో పతకం దక్కింది. ఇప్పటికే మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో రమిత, మొహులీ ఘోష్, ఆషి చౌక్సీతో కూడిన జట్టు రజత పతకం నెగ్గింది. చైనా 1896.6 పాయింట్లతో గోల్డ్ మెడల్ సాధించగా, 1886 పాయింట్లతో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఇక 1880 పాయింట్లతో మంగోలియా జట్టు కాంస్య పతకం దక్కించుకుంది.
ఇప్పుడు షూటర్ రమితా జిందాల్ (19) మరో పతకాన్ని భారత్ ఖాతాలో వేసింది. మహిళ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ విభాగంలో 252.7 స్కోర్‌తో చైనాకు చెందిన హువాంగ్ యూటింగ్ బంగారు పతకం దక్కించుకోగా, చైనాకే చెందిన హాన్ జియాయు 251.3 స్కోర్‌తో సిల్వర్ నెగ్గింది. భారత్ షూటర్ రమిత జిందాల్ 230.1 స్కోర్‌తో కాంస్యం గెలుచుకుంది.
కాగా, ఆసియా గేమ్స్ మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో చైనా షూటర్ హువాంగ్ యూటింగ్ 252.7 స్కోర్ నమోదు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ విభాగంలో ఇంత స్కోర్ నమోదు కావడం ఇదే తొలిసారని నిర్వాహకులు తెలిపారు. కాగా, రమిత జిందాల్ నెగ్గిన కాంస్యంతో కలిపి భారత్ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. రోయింగ్‌లో రెండు పతకాలు వచ్చాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

