IND Vs PAK | మ్యాచ్‌ను ఆపే హక్కు పాక్‌కు లేదు.. పీసీబీపై చర్యలు తీసుకోవాలన్న సునీల్ గవాస్కర్..!
IND Vs Pak | ఆసియాకప్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య చెలరేగిన షేక్ హ్యాండ్ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు పాకిస్తాన్‌తో జరిగిన రెండు మ్యాచుల్లోనూ కరచాలనం చేసేందుకు నిరాకరించింది.
IND Vs PAK | ఆసియాకప్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య చెలరేగిన షేక్ హ్యాండ్ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు పాకిస్తాన్‌తో జరిగిన రెండు మ్యాచుల్లోనూ కరచాలనం చేసేందుకు నిరాకరించింది. గ్రూప్ దశ మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఐసీసీకి అధికారికంగా ఫిర్యాదు చేసింది. అయితే, ఈ డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించింది. తాజాగా భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పాక్‌పై విమర్శలు గుప్పించారు. పీసీబీ చేసిన ఫిర్యాదు అర్థం లేనిదని, ఎందుకంటే నిబంధనల్లో ఎక్కడా షేక్ హ్యాండ్ తప్పనిసరి అని పేర్కొనలేదు అని గుర్తు చేశారు.
క్రీడల్లో జట్లు మ్యాచుల తర్వాత కరచాలనం చేయని సందర్భాలు ఉన్నాయన్నారు. నిజంగా పీసీబీ ఫిర్యాదు చేసి ఉంటే.. ఐసీసీ తిరస్కరించడం సరైందేనన్నారు. కరచాలనం వివాదంతో పాటు ప్రెస్‌మీట్‌కు హాజరయ్యేందుకు పాక్ నిరాకరించడంపై ప్రశ్నలు లేవనెత్తారు గవాస్కర్. పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు తప్పనిసరి ప్రెస్ కాన్ఫరెన్స్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కెప్టెన్, ఆటగాళ్లు, కోచ్‌ను పంపాల్సిన అవసరం లేదని.. వారి సీనియర్ సపోర్ట్ స్టాఫ్‌లోని ఎవరైనా మీడియాతో మాట్లాడి ఉండవచ్చన్నారు. ఈ ఉల్లంఘనకు ఏదైనా చర్య తీసుకుంటారా? లేదా అనేది ఆసక్తికరంగా ఉంటుందని పేర్కొన్నారు.
యూఏఈతో మ్యాచ్ ప్రారంభ మ్యాచ్ ఆలస్యంగా మొదలుకావడంపై గవాస్కర్ తీవ్రంగా స్పందించారు. ఒక గంట మ్యాచ్‌ను ఆలస్యంగా ప్రారంభించడం తప్పని పేర్కొన్నారు. మ్యాచ్ రిఫరీతో పీసీబీకి ఏవైనా ఫిర్యాదులు ఉంటే.. భారత్ చేతిలో ఓడిపోయిన తర్వాత ఆ సమస్యను లేవనెత్తడానికి వారికి రెండు పూర్తి రోజులు సమయం ఉంటుందని.. కానీ టాస్ వేసే ముందు వరకు మైదానంలోకి రాకుండా మొత్తం మ్యాచ్‌ను వారు తాకట్టు పెట్టారని స్పోర్ట్స్ కాలామ్లో విమర్శించారు. క్రికెట్ చట్టాల్లో ఎక్కడా మ్యాచ్ రిఫరీ క్షమాపణ చెప్పాలని పేర్కొనలేదని గవాస్కర్ గుర్తు చేశారు. మ్యాచ్ ప్రారంభం ఆలస్యం కావడానికి ఎలాంటి కారణం లేదని.. ఐసీసీ క్షమాపణ చెప్పలేదని స్పష్టంగా చెప్పిందన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

