Ravichandran Ashwin | సొంతగడ్డపై తిరుగులేని అశ్విన్.. కుంబ్లే ‘ఆల్‌టైమ్ రికార్డు’ బ్రేక్ చేస్తాడా?
Ravichandran Ashwin : భారత జట్టు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) ఇంగ్లండ్(England) పర్యటనకు సన్నద్ధమవుతున్నాడు. సొంతగడ్డపై తిరుగులేని రికార్డు ఉన్న ఈ స్టార్ బౌలర్ ఇంగ్లీష్ బ్యాటర్లను తన స్పిన్‌తో...
Ravichandran Ashwin : భారత జట్టు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) ఇంగ్లండ్(England) పర్యటనకు సన్నద్ధమవుతున్నాడు. సొంతగడ్డపై తిరుగులేని రికార్డు ఉన్న ఈ స్టార్ బౌలర్ ఇంగ్లీష్ బ్యాటర్లను తన స్పిన్‌తో ఉక్కిరిబిక్కిరి చేసేందుకు కాచుకొని ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో అశ్విన్‌ను అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి.
ఈ సిరీస్‌లో అశ్విన్ మరో 10 వికెట్లు తీస్తే 500 క్లబ్లో చేరుతాడు. 13 వికెట్లు పడగొడితే లెజెండరీ బౌలర్ అనిల్ కుంబ్లే(Anil Kumble) రికార్డును బద్ధలు కొట్టి… స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం కుంబ్లే 350 వికెట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు.

ప్రపంచంలోని మేటి బౌలర్లలో ఒకడైన అశ్విన్ ఇప్పటివరకూ స్వదేశంలో 55 టెస్టులు ఆడాడు. 20.87 సగటు, 2.68 ఎకానమీతో 337 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు రికార్డు స్థాయిలో 26 సార్లు 5 వికెట్లు తీసిన అశ్విన్ ఆరు పర్యాయాలు 10 వికెట్ల ప్రదర్శన చేశాడు. స్వదేశంలో, విదేశాల్లో కలిపి అశ్విన్ ఖాతాలో 490 వికెట్లు ఉన్నాయి. మరో 10 వికెట్లు తీస్తే 500 వికెట్ల క్లబ్లో చేరుతాడు. ఇప్పటివరకూ 8మంది బౌలర్లు 500 క్లబ్లో చోటు దక్కించుకున్నారు.
లియాన్, షేన్ వార్న్, మురళీధరన్

శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. దివంగత ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్ 708 వికెట్లతో రెండో స్థానంలో.. ఇంగ్లండ్ వెటరన్ బౌలర్ జేమ్స్ అండర్సన్ 690 వికెట్లతో మూడో స్థానంలో నిలిచారు. భారత దిగ్గజం అనిల్ కుంబ్లే 619 వికెట్లతో నాలుగో స్థానంలో.. ఇంగ్లండ్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్ 604 వికెట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. మెగ్‌గ్రాత్(ఆస్ట్రేలియా) 563, కొర్నే వాల్ష్(వెస్టిండీస్) 519, నాథన్ లియాన్(ఆస్ట్రేలియా) 512 వికెట్లతో వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నారు.

ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య జనవరి 25న ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్టు షురూ కానుంది. ఫిబ్రవరి 2న విశాఖపట్టణంలో రెండో టెస్టు, రాజ్‌కోట్‌లో ఫిబ్రవరి 15న మూడో టెస్టు, రాంచీలో ఫిబ్రవరి 23న నాలుగో టెస్టు, ధర్మశాలలో మార్చి 7న ఆఖరి టెస్టు జరుగనుంది.
ఇవి కూడా చదవండి
- Mallareddy | పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్నే గెలిపిస్తారు : మల్లారెడ్డి
- Invitation | ముంబై లాల్బాగ్ గణేశ్ ఉత్సవ మండలికి ‘అయోధ్య’ ఆహ్వానం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

