Arshad Khan | టీ20ల్లో సంచలనం.. 9 పరుగులకే 6 వికెట్లు తీసిన ఐపీఎల్ స్టార్..!
Arshad Khan : పొట్టి క్రికెట్లో మరో సంచలనం నమోదైంది. భారత దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT)లో యువ పేసర్ అర్షద్ ఖాన్ (Arshad Khan) చరిత్ర సృష్టించాడు.
Arshad Khan : పొట్టి క్రికెట్లో మరో సంచలనం నమోదైంది. భారత దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో యువ పేసర్ అర్షద్ ఖాన్ (Arshad Khan) చరిత్ర సృష్టించాడు. మధ్యప్రదేశ్‌కు ఆడుతున్న ఈ ఎడమచేతివాటం పేసర్ లీగ్ చరిత్రలోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఛండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో నిప్పులు చెరిగిన అర్షద్ కేవలం తొమ్మిది పరుగులే ఇచ్చి 6 వికెట్లతో ఔరా అనిపించాడు. స్మాట్‌లో ఇప్పటివరకూ బెస్ట్ బౌలింగ్ రికార్డు నెలకొల్పిన టి.రవి తేజ, అర్జాన్లను అధిగమించాడు అర్షద్.
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్షద్ ఖాన్ స్మాట్‌లో రెచ్చిపనోయాడు. ఆదివారం ఛండీగఢ్ బ్యాటర్లను క్రీజులో నిలవనీయని అర్షద్.. సంచలన స్పెల్‌తో 6 వికెట్లు తీశాడు. రెండో ఓవర్లోనే ఓపెనర్ అర్జున్ అజాద్, శివం భాంబ్రీను ఔట్ చేసిన ఈ ఎంపీ పేసర్.. తర్వాతి ఓవర్లో మరో వికెట్ పడగొట్టాడు. 19వ ఓవర్లో మూడు వికెట్లు తీసిన ఈ స్పీడ్‌స్టర్.. టోర్నీ చరిత్రలో అత్యంత ఉత్తమ బౌలింగ్(6/9) గణాంకాలు నమోదు చేశాడు.
🚨 Record Alert 🚨
4️⃣ Overs
1️⃣ Maiden
9️⃣ Runs
6️⃣ WicketsMohd. Arshad Khan produced the best ever bowling figures in #SMAT history.
He achieved the feat playing for Madhya Pradesh against Chandigarh in Kolkata 👏🙌
Scorecard ▶️ https://t.co/qYYGlGVy3s@IDFCFIRSTBank pic.twitter.com/9e5HyomVVn
— BCCI Domestic (@BCCIdomestic) December 7, 2025
అర్షద్ ఖాన్ కంటే ముందు హైదరాబాద్ బౌలర్ రవితేజ, గుజరాత్ బౌలర్ అర్జాన్ నగ్వస్వల్లా 6/13తో స్మాట్‌లో రికార్డు నెలకొల్పారు. 2015లో సర్వీసెస్ పేసర్ డీఎస్ పూనియా 6/14, బరోడా స్పిన్నర్ స్వప్నిల్ సింగ్ 6/19తో అదరగొట్టారు. తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. అర్షద్ విజృంభణతో ఛండీగఢ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులకే పరిమితమైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

