ఫోర్ట్‌వర్త్(యుఎస్): టాప్ ర్యాంకర్ ఇగా స్వియాటెక్ విజయ పరంపరకు అరినా సబలెంకా చెక్ పెట్టింది. డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీలో సబలెంక 6-2, 2-6, 6-1తో స్వియాటెక్‌ను ఓడించి టైటిల్ పోరుకు చేరుకుంది. ఫైనల్లో సబలెంకా.. ఫ్రెంచ్ క్రీడాకారిణి కరోలినా గార్సియాతో తలపడుతుంది. గార్సియా 6-3, 6-2తో మరియా సక్కారిపై గెలుపొంది అంతిమ పోరుకు సిద్ధమైంది.