MI vs RR | బంతితోనూ దెబ్బకొట్టిన ఆర్చర్.. పోరాడుతున్న సూర్య, జాక్స్..!
MI vs RR : భారీ ఛేదనలో ముంబై ఇండియన్స్‌కు రాజస్థాన్ రాయల్స్ పేసర్ ఆర్చర్(2-14) చుక్కలు చూపించాడు. తొలి ఓవర్లోనే రోహిత్ శర్మ(0)ను డకౌట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో నమన్ ధిర్(6)ను బౌల్డ్ చేశాడు.
MI vs RR : భారీ ఛేదనలో ముంబై ఇండియన్స్‌కు రాజస్థాన్ రాయల్స్ పేసర్ ఆర్చర్(2-14) చుక్కలు చూపించాడు. బ్యాటుతో 32 పరుగులు చేసిన ఈ స్పీడ్‌స్టర్ బంతితోనూ విజృంభించి తొలి ఓవర్లోనే రోహిత్ శర్మ(0)ను డకౌట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో నమన్ ధిర్(6)ను బౌల్డ్ చేశాడు. ఆ షాక్ నుంచి తేరుకోకముందే.. డేంజరస్ రికెల్టన్(12) బర్గర్ బౌలింగ్‌లో వైభవ్ చేతికి చక్కాడు.
వాంఖడేలో రాజస్థాన్‌కు భారీ స్కోర్ సమర్పించుకున్న ముంబై బ్యాటింగ్‌లో తడబడుతోంది. తొలి ఓవర్లోనే రోహిత్ శర్మ(0)ను డకౌట్ చేసిన ఆర్చర్(2-14) తర్వాతి ఓవర్లో నమన్ ధిర్(6)ను బౌల్డ్ చేసి రెండో వికెట్ అందించాడు. బర్గర్ ఓవర్లో రికెల్టన్(12)కవర్స్‌లో వైభవ్ చేతికి చిక్కగా. 24 వద్ద మూడో వికెట్ పడింది.
Rohit Sharma ✅
Naman Dhir ✅Jofra Archer means business tonight 🔥
Updates ▶️ https://t.co/h2ze7K0gd6#TATAIPL | #KhelBindaas | #MIvRR | @rajasthanroyals pic.twitter.com/8ZeY8G5pjp
— IndianPremierLeague (@IPL) May 24, 2026
అనంతరం సూర్యకుమార్ యాదవ్(18 నాటౌట్)తో కలిసి తిలక్ వర్మ(3) ఇన్నింగ్స్ నిర్మించాలనుకున్నాడు. కానీ, బ్రిజేష్ అతడిని బౌల్డ్ చేయడంతో పవర్ ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది ముంబై. ప్రస్తుతం విల్ జాక్స్(9 నాటౌట్) జతగా సూర్య పోరాడుతున్నాడు. 6 ఓవర్లకు స్కోర్.. 49-4.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

